ముంబయి : బాలీవుడ్ హాటెస్ట్ ఫిగర్ కత్రినా కైఫ్ కుర్రకారుకు కనువిందు చేసేలా హొయలొలకించేందుకు రెడీ అవుతోంది.. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దోస్తానా మూవీ సీక్వెల్లో కత్రినా బికినీ ధరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా రోజుల గ్యాప్ తరువాత కత్రినా స్విమ్ సూట్ ధరిస్తుండటంతో దోస్తానా మూవీలో ఆమె అందాన్ని చూసేందుకు అభిమానులు అపుడే ఆశగా ఎదురు చూస్తున్నారు.
కత్రినా బికినీ ధరించి సరిగ్గా ఏడేళ్లయింది. బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కొత్తలో నటించిన బూమ్ సినిమాలో స్విమ్ సూట్ ధరించి యూత్ ను ఎట్రాక్ట్ చేసింది. ఆ సినిమా హిట్ తో క్రేజ్ పెంచుకున్న కత్రినా ఆ తరువాత బికినీ ధరించడానికి బై బై చెప్పింది. అయితే ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న దోస్తానా సినిమాలో మాత్రం బికినీ ధరించేందుకు కత్రినా ఓకే చెప్పినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. స్విమ్ సూట్ లో కనువిందు చేసేందుకు సదరు నిర్మాత భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో కత్రినా పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఇటీవల ప్రియాంక చోప్రా కూడా గోల్డ్ స్విమ్ సూట్ లో మురిపిస్తూ దర్శనమివ్వడంతో కత్రినా కూడా ఇపుడు పోటీపడి బీచ్ లో బికినీ సీన్ లకు సిద్దమైంది.
దోస్తానా సినిమాలో స్క్రిప్ట్ కు అనుగుణంగా రెండు సీన్లలో బీచ్లో బికినీతో ఆమె దర్సనమివ్వనుందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కత్రినా అందచందాలకు తగ్గట్టుగా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా బికినీని రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే బికినీలు ఏ స్టైల్లో ఉంటే ఆకట్టుకుంటాయోనని దోస్తానా వర్గాలు చర్చలు సాగిస్తున్నారు. దోస్తానా - 2 లో కత్రినా పలు సెక్సీ సీన్లలో కనువిందు చేయనుందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బికినీ సీన్లు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో కత్రినా బికినీలోనూ, సాదారణ డ్రెస్సుల్లో కూడా కైపెక్కించనుందని బాలీవుడ్ లో లేటెస్ట్ టాక్