మళ్లీ ఐశ్వర్య ఐటెం
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/aishwaryarai.jpg' align='right' alt=''>ఒకవైపు శంకర్ 'రోబో', మణిరత్నం 'రావణ్' చిత్రాల్లో సోలో హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్యా బచ్చన్ కొద్ది గ్యాప్ తర్వాత మళ్లీ ఓ ఐటెం సాంగ్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాల భోగట్టా. 'బంటీ ఔర్ బబ్లీ', 'శక్తి-ది పవర్' చిత్రాల్లో ఐశ్వర్య ఐటెం సాంగ్స్ లో నటించింది. తాజాగా అక్షయ్ కుమార్ కథానాయకుడుగా నటిస్తున్న 'హౌస్ ఫుల్'లో ఐటెం సాంగ్ కు ఐశ్వర్య 4 రోజుల పాటు తన డేట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.
అక్షయ్ కుమార్, దీపిక, అర్జున్, రితీష్, జియా, లారాదత్తా తదితరులు నటిస్తున్న'హౌస్ ఫుల్' చిత్రాన్ని సాదిజ్ నడియడ్ వాలా నిర్మిస్తున్నారు. సాజిద్ ఖాన్ దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రంలో దీపిక, జియాఖాన్, లారా దత్తా బికినీలలో కనిపించే కొన్ని సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. అయితే మరింత గ్లామర్ లుక్ తెచ్చేందుకు సాదిజ్ నడియడ్ వాలా, సాదిజ్ ఖాన్ ఇటీవల ఐశ్వర్యను కలిసి ఐటెం సాంగ్ కు ఒప్పించారని సినీ వర్గాల సమాచారం. సినిమా ప్రమోషనల్ ట్రాక్ లో భాగంగా ఈ సాంగ్ వస్తుందనీ, అయితే సినిమాలో కూడా ఉంటుందా, చివర్లో వచ్చే టైటిల్ కార్డ్స్ లో కనిపిస్తుందా అనేది ఇంకా తెలియవలసి ఉందనీ వారంటున్నారు. ముంబై ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. ఇందులో అక్షయ్ , దీపిక, అర్జున్, రితీష్, జియా, లారాతో పాటు 500 మంది ఎక్స్ ట్రా యాక్టర్లు, 200 మంది డాన్సర్లు పాల్గొంటారనీ తెలుస్తోంది. ప్రస్తుతం 'యాక్షన్ రీప్లే' షూటింగ్ లో ఉన్న ఐశ్వర్య అది పూర్తి చేసుకుని ఈ సాంగ్ లో పాల్గొంటుందని తెలుస్తోంది. సమ్మర్ రిలీజ్ గా 'హౌస్ ఫుల్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
News Posted: 29 January, 2010
|