అమ్మతనానికి రాణీ దూరం ముంబయి : ప్రసిద్ధ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తల్లి కావడానికి ససేమిరా అంటోంది... ఆశ్చర్యపోతున్నారా? అవును.. మీరు చదివింది కరక్టే.. తల్లి కావడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని, పిల్లల తల్లిగా తాను ఉండలేనని రాణీ నిర్మొహమాటంగా చెబుతోంది. రాణీ ఇంతలా తెగించి బాహాటంగా స్టేట్ మెంట్ ఇస్తోందేంటా అని కంగారు పడుతున్నారా.. మరేం లేదండీ రాణి చెప్పింది రియల్ లైఫ్ గురించి కాదు. రీల్ లైఫ్ లో తాను తల్లి పాత్రలు వేయనని స్పష్టం చేసిందంతే.
సల్మాన్ రష్దీ రచించిన నవల ఆధారంగా బాలీవుడ్ నిర్మాత దీపా మెహతా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో దీపా నిర్మించే సినిమాలో నటించాలని రాణీ ఉవ్విళ్లూరగా, ఇపుడు తీరా ఆ ఛాన్స్ వచ్చేసరికి మాత్రం తాను నటించబోనని చెబుతోంది. తన సినిమాలో 1 4 ఏళ్ల బాలుడి తల్లి పాత్రను వేయాలని దీపా మెహతా ఆఫర్ ఇచ్చింది. అయితే ఆమె ఆఫర్ ను రాణీ తిరస్కరించింది. తనకు సినిమాల్లో తల్లి కావడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. రామ్, బ్లాక్, బంటీ ఔర్ బబ్లీ, వీర్ జారా వంటి చిత్రల్లో రాణీ నటనను మెచ్చిన దీపా ఈ అవకాశాన్ని రాణీకి ఇవ్వాలనుకున్నా ఆమె తిరస్కరించింది.
అయితే, రాణీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే తల్లి పాత్ర చేనన్నదని తెలిసింది. అయితే ఎందుకు, ఏమిటీ అన్న కారణాలు మాత్రం బయటకు పొక్కకుండా రాణీ, దీపాల మధ్యే రహస్యంగా ఉంచినట్లు తెలిసింది. గతంలో యాష్ రాజ్ చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లి పాత్ర వేసిన రాణీ ఇపుడు మాత్రం ఎందుకు తల్లి కానంటుందో మరి..?
News Posted: 30 January, 2010
|