అంత సీన్ నాకు లేదు: సైఫ్ ముంబయి: భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారానికి తాను అర్హుడిని కానని బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ అన్నారు. తనను మించిన నటులు భారతదేశంలో చాలా మంది ఉన్నారని సైఫ్ వ్యాఖ్యానించారు. నటుడు అమీర్ ఖాన్ కు పద్మభూషణ్, నటి రేఖకు పద్మశ్రీ అవార్డులు ఈ ఏడాది ప్రకటించడం సబబేనని, వారికి అవార్డు పొందేందుకు అవసరమైన అన్ని అర్హతలున్నాయని సైఫ్ కితాబునిచ్చారు.
పద్మ అవార్డులు ప్రకటించినపుడు జాబితాలోని గొప్ప నటులు, ప్రతిభావంతుల సరసన తన పేరు కూడా ఉండటం చూసి తాను కాస్త ఉద్విగ్నతకు గురయ్యానని సైఫ్ మురిసిపోతూ చెప్పాడు. పద్మశ్రీ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని, హోదాకు తగ్గట్లుగా తాను నడుచుకోవాల్సి ఉందని తెలిపాడు. అయితే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న సైఫ్ ఇకపై ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు సినీ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అవార్డులపై కన్నేయడం విశేషం.
News Posted: 30 January, 2010
|