సల్మాన్ త్యాగం ముంబయి : కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా స్టైలిష్ యాక్టర్ రజనీకాంత్ ను ఆదర్శంగా తీసుకున్నట్లే కనిపిస్తోంది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన 'వీర్' సినిమా అందరి అంచనాలను బోర్లా పడేలా చేసింది. అంతేగాక ఇటు హీరోకు, అటు నిర్మాతకు తీవ్ర నిరాశను మిగిల్చిడమే కాక కష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్నో అంచనాలు పెట్టుకుని భారీ బడ్జెట్ తో నిర్మించిన వీర్ సినిమా అట్టర్ ప్లాఫ్ కావడంతో నిర్మాత తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నారు. ఆలాగే ఈ చిత్ర విజయంపై సల్మాన్ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. . అయితే తన నిరాశను పక్కన పెట్టి నిర్మాత ఆర్ధిక కష్టాలను పంచుకునేందుకు సల్మాన్ సిద్ధమయ్యాడు. నిర్మాత విజయ్ గిలానీ ఆర్ధిక కష్టాలను కాస్త గట్టెక్కించేందుకు వీలుగా సల్మాన్ కూడా తన వంతు సహాయం చేయాలని నిశ్చియించాడు.
ఈ మేరకు వీర్ సినిమా పారితోకాన్ని వదులుకోవాలని సల్మాన్ భావిస్తున్నట్లు తెలిసింది. తను తీసుకున్న 15 కోట్ల పారితోషికాన్ని విజయ్ గిలానీకి సల్మాన్ తిరిగి చెల్లిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి . వీర్ కారణంగా నిర్మాతకు దాదాపుగా 25 నుండి 30 కోట్ల రూపాయలు వరకు నష్టం వాటిల్లింది. సినిమా ప్లాఫ్ కావడంలో తన పాత్ర కూడా ఉందని గ్రహించిన సల్మాన్ నిర్మాతకు వచ్చిన 25 కోట్ల నష్టాన్ని చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు సల్మాన్ 10కోట్ల రూపాయలను ఇప్పటికే చెల్లించాడని, మిగిలిన మొత్తాన్ని కూడా అతి త్వరలోనే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మొత్తానికి వీర్ ఇటు నిర్మాతకు, అటు హీరోకు తేరుకోలేని దెబ్బ తీసింది.
News Posted: 1 February, 2010
|