'ఫిర్ కభీ'కి అవార్డు
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/phirkabhi.jpg' align='right' alt=''>తిరువనంతపురం: ప్రముఖ దర్శకుడు వి.కె.ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన 'ఫిర్ కభీ' హిందీ చిత్రం 2009 సంవత్సరానికి గాను లాస్ ఏజెంల్స్ రీల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 'నేరిటివ్ ఫీచర్' విభాగంలో ఈ అవార్డు లభించింది. ఉత్తమ దర్సకుడుగా ప్రకాష్ ఎంపికయ్యారు. ఈ చిత్రాన్ని నిర్మించిన యుటీవీ గత ఏడాది సొంతంగా ఈ చిత్రాన్ని విడుదల చేసింది.
నేరేటివ్ సెక్షన్ లో ఇంచుమించు అన్ని అవార్డులు ఈ చిత్రం కైవసం చేసుకోవడం విశేషం. ఉత్తమ రచయిత (ఎం.సింధురాజ్), ఒరిజనల్ స్కోర్ (రజత థోలకియా/ శాంతను మొయిత్రా), ప్రొడక్షన్ డిజైన్ (నితిన్ దేశాయ్/అంజన్ ఘోష్), కాస్టూమ్ డిజైన్ (భాను అతైయ్య/సింపుల్ కపాడియా)లకు అవార్డులు దక్కాయి. మిధున్ చక్రవర్తి, డింపుల్ కపాడియా జంటగా ఈ చిత్రంలో నటించారు. చిన్నతనంలో చిగురించిన ప్రేమను వెదుక్కుంటూ ఇద్దరు వృద్ధులు చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథ. ప్రకాష్ గతంలో 'పునరధివాసం', 'ముల్లవల్లియుం తెన్ మావుం', 'గులుమల్' వంటి మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పలు పాపులర్ మలయాళ చిత్రాలకు సింధూర్జీ స్క్రిప్టు అందించారు.
News Posted: 1 February, 2010
|