'ముద్దూ వద్దు..బికినీ వద్దు'
ముంబయి : ము..ము..ముద్దంటే వద్దంటోంది బాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ కత్రినా. అంతేకాదు బికినీలకు కూడా నో చెప్పేస్తోందీ తారామణి. దోస్తానా-2 లో బికినీలో అందాలు ఆరబోసేందుకు తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కైఫ్ ఇప్పుడు మాట మార్చింది. బికినీ వద్దు.. ముద్దూ వద్దు.. అంటూ మురిపిస్తోంది. ఇకపై ముద్దు సీన్లలో నటించేది లేదని తేల్చి చెబుతోంది కైఫ్. అలాగే బికినీ ని ధరించేందుకు కూడా ససేమీరా అంటోంది. దర్శక, నిర్మాతలు ఎంతగా కన్వీన్స్ చేసినా మాట తప్పేది లేదని స్పష్టం చేస్తోంది. కత్రినా ముద్దులు వద్దుంటూ..బికినీలకు బై చెప్పడం నిజమేనని కత్రినా స్నేహితురాలు ధృవీకరించింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని దోస్తానా-2 నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు తరుణ్ మనుస్కణీలకు కూడా తేల్చి చెప్పిందని ఆమె తెలిపారు. బాలీవుడ్ హిట్ మూవీ దోస్తానా సీక్వెల్ లో కత్రినా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కత్రినా బికినీ ధరించేందుకు ఓకే చెప్పిందని ఆ మధ్య వార్తలు వెల్లువెత్తాయి.
అయితే ముద్దు,బికినీ సీన్లలో తాను గతంలో నటించినప్పటికీ ఇకపై మాత్రం తాను నటించలేనని, అలా చేయడం తనకు చాలా అసౌకర్యంగా ఉందని కైఫ్ చెప్పింది. సినిమాల్లో దృశ్యాలకు అనుగుణంగా ముద్దులు తప్పవని డైరక్టర్లు చెప్పినా తాను అంగీకరించే పరిస్థతి లేదని కూడా స్పష్టం చేసిందామె. అయితే తన ప్రియుడు సల్మాన్ సూచనల మేరకే ఏ నిర్ణయమైనా తీసుకునే కత్రినా ఇపుడు తాజాగా మాట మార్చి చెబుతోందని సినీవర్గాలు ఊహిస్తున్నాయి.. సల్మాన్ చేసిన సూచన మేరకే బికినీ, ముద్దు దృశ్యాల్లో నటించరాదని కత్రినా నిర్ణయుం తీసుకున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. న్యూయార్క్ సినిమాలో కబీర్ ఖాన్ తో పెదాలను పెనవేసుకొని ముద్దు సీన్లలో మైమరిపించిన కైఫ్ ఇకపై హీరోలకు ముద్దు పెట్టేది లేదని చెప్పడానికి కూడా సల్మాన్ చేసిన సలహాయేనని అంటున్నారు. అయితే కత్రినా గతంలో ఇలానే నో కిస్..నో బికినీ అని చెప్పినా ఆ తరువాత 'రాజనీతి' ' అజబ్ ప్రేమ్ కీ ఘజబ్ కహానీ' వంటి సినిమాల్లో చేసింది. మరి ఇప్పుడు కూడా సల్మాన్ మాట మీదే ఉంటుందా లేక ముద్దులకు రెడీ అంటుందో వేచి చూడాలి మరి
News Posted: 3 February, 2010
|