అమీర్ కు పితృ వియోగం
ముంబై: ప్రముఖ హిందీ నటుడు అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ గుండెపోటుతో ముంబైలో కన్నుమూశారు. మంగళవారం ఉదయం బాంద్రాలోని అమీర్ నివాసంలో ఆయన తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలినట్టు ఆయన కుటుంబ వర్గాలు వెల్లడించాయి. హుస్సేన్ కు భార్య, ఇద్దరు కుమారులు అమీర్, ఫైసల్ ఖాన్, ఇద్దరు కుమార్తెలు ఫర్హత్, నిఖత్ ఉన్నారు.
అమీర్ ఖాన్ నటించిన 'హమ్ హై రాహి ప్యార్ కే' (1993)తో పాటు 'దుల్హా బిక్తా హై' (1982), జఖ్మీ (1975), అనామిక (1973), కారవాన్ (1971) వంటి హిట్ చిత్రాలను హుస్సేన్ నిర్మించారు. అమీర్-జూహీ చావ్లా నటించిన 'తుమ్ మేరే హో' చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. అమెరికాలోని సండేన్స్ ఫెస్టివల్ కు హాజరైన అమీర్, కిరణ్ రావు దంపతులు హుస్సేన్ మరణవార్త తెలియడంతో హుటాహుటిని విమానంలో ముంబైకి బయలుదేరారు. న్యూజిలాండ్ లో ఉన్న హుస్సేన్ సోదరుడైన నజీర్ హుస్సేన్ తనయుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ముంబై తిరిగి వస్తున్నారు.
News Posted: 3 February, 2010
|