కత్రిన ఒడికి చిరుత
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/katrina-leopard.jpg' align='right' alt=''>బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ దృష్టి ఇప్పుడు ఓ చిరుత పిల్లపై పడింది. అనుకున్నదే తడవు ఆ పిల్ల చిరుతను దత్తత చేసుకునేందుకు ముందుకు వచ్చింది. భోపాల్ లోని వనవిహార్ జాతీయ పార్కులో ప్రస్తుతం ఈ చిరుత పిల్ల ఉంది.
ఈమధ్యనే ఓ గ్రామంలోకి తప్పిపోయి వచ్చిన ఈ కూనను గ్రామస్థుల బారి నుంచి అధికారులు రక్షించి పార్కుకు చేర్చారు. ఎంతో ముద్దుముద్దుగా ఉండటంతో దానికి కత్రిన అనే పేరు కూడా పెట్టారు. ఈ విషయం ఆనోటా ఆనోటా కత్రినా కైఫ్ చెవిన పడటంతో వెంటనే వనవిహార్ అధికారులను ఆ విషయం అడిగి తెలుసుకుంది. ఆ చిరుత కూనను పెంచుకోవాలనే కోరికను కూడా వ్యక్తం చేసింది. కత్రినా గత వారంలో తమను సంప్రదించిన విషయాన్ని పార్క్ అసిస్టెంట్ డైరెక్టర్ ధ్రువీకరించారు. చిరుత కూన పేరు కత్రినా కాదనీ, కేట్రినా అనీ ఆయన నవ్వుతూ వివరణ ఇచ్చారు. కేట్రినాను దత్తతు చేసుకోవాలంటే దాని సంరక్షణ, ఆహార సదుపాయాల కోసం ఏటా 50,000 రూపాయలు పార్క్ నిర్వాహకులకు కత్రిన చెల్లించాల్సి ఉంటుందట. ఏతావాతా...చిరుత పిల్లను దత్తతు చేసుకోవడం అంటే ఇంట్లో కట్టిపడేయడం కాదు. దాని సంరక్షణ చూసుకోవడంగానే అర్ధం చేసుకోవాలి.
News Posted: 3 February, 2010
|