జాక్సన్ పాటకు రెహ్మాన్ రీమేక్
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/rehman-jockson.jpg' align='right' alt=''>ప్రపంచాన్ని తన పాప్ సంగీతంతో ఉర్రూతలూగించిన మైకేల్ జాక్సన్ శాంతి గీతం 'ఉయ్ ఆర్ ది వరల్డ్'ను ఇప్పుడు ఆస్కార్, గ్రామీ అవార్డుల విజేత ఎ.ఆర్.రెహ్మాన్ రీమేక్ చేయబోతున్నారు. ఇది కూడా ఓ మహోన్నత ఆశయం కోసం విశేషం. కరేబియన్ ఐలాండ్ హైతిలో ఇటీవల సంభవించిన భారీ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు నిధుల సేకరణ నిమిత్తం రెహ్మాన్ తనవంతు చేయూతగా ఈ కార్యక్రమానికి నడుం బిగించారు.
కరేబియన్ ఐలాండ్ లో సంభవించిన ప్రకృతి వైపరీత్యంలో సర్వం కోల్పోయిన వారిని అదుకునేందుకు సహకరించాల్సిందిగా ప్రముఖ నిర్మాత క్విన్సీ జోన్స్, సింగర్ లైనెల్ రిచీ ఇటీవల రెహ్మాన్ ను కోరడంతో ఆయన వెంటనే సమ్మతించారు. కొత్తరూపు సంతరించుకోనున్న 'ఉయ్ ఆర్ ద వరల్డ్' శాంతి గీతం కోసం రెహ్మాన్ తో సహా సెలీనె డియోన్, లియోనెల్ రిచీ, కన్యెతో సహా 100 మంది సింగర్లు తమ గాత్రాన్ని అందించబోతున్నారు. ఈ రీమేక్ సాంగ్ ను ఈనెల 12న ప్రారంభం కానున్న 'వింటర్ ఒలంపిక్స్' సందర్భంగా ఎన్.బి.సి. నెట్ వర్క్ లో తొలుత ప్రసారం చేస్తారు.
News Posted: 6 February, 2010
|