జర్మన్ రోడ్డుకు ఐశ్వర్య పేరు
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/aishwarya-rai7.jpg' align='left' alt=''>బాలీవుడ్ లో ప్రముఖ నటిగా, మాజీ ప్రపంచ సుందరిగా, బచ్చన్ల కోడలుగా ఐశ్వర్యారాయ్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆమధ్య లండన్ లోని ప్రతిష్ఠాత్మక మేడమ్ తుస్సాడ్ లో ఐశ్వర్య మైనపు బొమ్మ ఏర్పాటు చేశారు. అమెస్టర్ డామ్ లో ఒక తామరపువ్వుకు ఏకంగా ఐశ్వర్య పేరు పెట్టారు. తాజాగా జర్మనీలోని ఓ వీధికి ఐశ్వర్య పేరు పెట్టబెట్టబోతున్నారు.
జర్మనీలో గత కొన్నేళ్లుగా బాలీవుడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కింగ్ ఖాన్ (షారూక్), ఐశ్వర్యారాయ్ చిత్రాలంటే పడిచచ్చేంత అభిమానం ప్రదర్శిస్తుంటారు. కేవలం అక్కడి ఇండియన్సే కాకుండా స్థానికులు కూడా ఈ సినిమాలను విపరీతంగా ఆదరిస్తుంటారు. జర్మనీలో ఐశ్వర్యకు మంచి క్రేజ్ ఉందనీ, ఆమె నటించిన పలు యాడ్ ల ప్రదర్శనతో పాటు, హోర్డింగ్ లపై ఆమె చిత్తరువులు తరచు కనిపిస్తుంటాయనీ, ముఖ్యంగా ఇలాంటి హోర్డింగ్ లు బెర్లిన్, ఫ్రాంక్ ఫుర్ట్ లోని ప్రధాన వీధుల్లో కనిపించి అలరిస్తుంటాయనీ అక్కడి వారు చెబుతున్నాయి. ఫ్రాంక్ ఫుర్ట్ సమీపంలో బడేన్-బడేన్ అనే ఓ చిన్న పట్టణం ఉంది. ఇక్కడ సెటిలైన ఇండియన్లు కూడా గణనీయంగానే ఉన్నారు. భారతీయ పండుగలన్నింటినీ వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. అంతే ఉత్సాహంతో ఐశ్వర నటించిన చిత్రాలను కూడా ఆదరిస్తుంటారు. ఇప్పుడు ఐశ్వర్యపై మరింత అభిమానం చాటుకుంటూ బడేన్-బడేన్ లోని ఓ వీధికి ఆమె పేరు పెట్టబోతున్నారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ పట్టణంలోని ప్రజల్లో సోషలిస్టు, పొలికటల్ భావాలు ఎక్కువ. దాదాపు అన్ని వీధులు రాజకీయనాయకుల పేర్లతోనే, ఫిలాసఫర్ల పేర్లతోనే ఉంటాయి. అయితే ఐశ్వర్య వంటి ఒక ఫిల్మ్ స్టార్ కు ఇలాంటి గౌరవం దక్కడం మాత్రం ఇదే మొదటిసారి. దటీజ్ ఐష్...
News Posted: 6 February, 2010
|