అప్పుడే వద్దు: జనీలియా
ముంబయి : నాకు పెళ్లా...అప్పుడేనా..! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ లకు కొత్తకాదు. అయితే ఇపుడు తాజాగా హీరోయిన్ జెనీలియా డిసౌజా కూడా ఈ తరహా స్టేట్ మెంట్లే ఇస్తోంది. ఇప్పుడప్పుడే తనకు ఎవరినీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెబుతోంది. బావీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ తో జెనీలియా వివాహం జరుగనుందంటూ వెలువడిన వార్తలపై కూడా ఆమె తీవ్రంగా మండిపడుతోంది. జెనీలియా , రితేష్ ల మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోందని, త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకొనున్నారని ఓ టాబ్లాయిడ్ కథనాన్ని ప్రచురించింది. అంతేగాక 2003లో వీరిద్దరూ కలసి నటించిన తుఝే మేరీ కసమ్ చిత్రం చేస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురు తొడిగిందని ఆ వార్తలో పేర్కొంది.
దీంతో తన పెళ్లికి సంబంధించి జరుగుతన్న ప్రచారం కెరీర్ కు దెబ్బ తీస్తుందేమోనని ఈ భామ కలవరం చెందుతోంది. 'నాకు కెరీర్ ముఖ్యం. నేను నటిస్తున్న సినిమాలు, చేస్తున్న వాణిజ్య ప్రకటనలు నాకు ముఖ్యం. అందుకే నేను ఇప్పడప్పుడే పెళ్లి చేసుకోదలుచుకోలేదు' అని మీడియాకు ప్రకటన జారీ చేసింది జెనీలియా. నా పెళ్లి గురించి నేను చెప్పాలి, అలా కాకుండా నా వ్యక్తిగత జీవతంలోకి చొరబడి పత్రికలు ఇలాంటి నిరాధార వార్తలను ఎలా ప్రచురిస్తాయని ఆమె ఆగ్రహంతో రుసరుసలాడింది. ఆధారం లేకుండా ఉహాజనిత వార్తల కారణంగా తన కుటుంబ ప్రతిష్టకు భంగం కులుగుతుందని జెనీలియా ఆవేదన వ్యక్తం చేసింది.
News Posted: 8 February, 2010
|