'ఆయిరత్తిల్'కు కొత్త ట్రబుల్!
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/Aayirathil-Oruvan.jpg' align='right' alt=''>తమిళ పాపులర్ దర్శకుడు శ్రీరాఘవ (సెల్వ రాఘవన్) ద్విభాషా చిత్రం 'ఆయిరత్తిల్ ఒరువన్' (తెలుగులో 'యుగానికి ఒక్కడు')కు రిలీజ్ అనంతరం కూడా కష్టాలు తప్పడం లేదు. కార్తి, రీమాసేన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రెండేళ్లకు పైగా శ్రమించి 45 కోట్ల భారీ బడ్జెట్ తో డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ సంస్థ నిర్మించింది. తొలుత రెండు భాషల్లోనూ ఏకకాలంలో పొంగల్ కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నప్పటికీ శ్రీరాఘవ తన చిత్రానికి కోటిన్నర అడ్వాన్స్ తీసుకుని తమకు కాకుండా డ్రీమ్ వాలి చిత్రానికి పనిచేసినందున ఆ చిత్రం విడుదలై స్టే ఇవ్వాలంటే ఓ నిర్మాత ఈమధ్యనే కోర్టు కెక్కారు. అనంతర పరిణామాల్లో భాగంగా తమిళంలో పొంగల్ కు రిలీజైన ఈ చిత్రం తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు. తమిళ వెర్షన్ కు వచ్చిన స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో నిర్మాతలు ఎక్కువ జాప్యం చేయకుండా 45 నిమిషాల నిడివిని తొలగించి (ట్రిమ్ చేసి) తెలుగులో గత శుక్రవారమే రిలీజ్ చేశారు. తాజాగా 'ఆయిరతిల్ ఒరువన్' మరోసారి చిక్కుల్లో పడింది. ఈ చిత్రంపై నిషేధం విధించాలంటూ చోళర్ పెరవై అధ్యక్షుడు టివికె అళగిరి చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు.
ప్రపంచంలోనే నాగరికతకు చోళుల కాలం పెట్టింది పేరనీ, అయితే చోళుల నాటి రోజుల్ని చాలా తక్కువ చేసి ఈ చిత్రంలో చూపించారంటూ అళగిరి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ చిత్రాన్నిసర్టిఫై చేసిన సెన్సార్ బోర్డును కూడా తన పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి డ్రీమ్ వాలీ కార్పొరేషన్, సెల్వరాఘవ, సెన్సార్ బోర్టుకు తగిన వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈనెల 17వ తేదీలోగా వీరు కోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
News Posted: 8 February, 2010
|