కత్రిన రిక్షా సవారీ
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/katrina13.jpg' align='right' alt=''>ఒంటరిగా ముంబై రోడ్లపై ప్రయాణించడం, రిక్షాలో సవారీ చేయడం వంటివి కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు కొత్త కాదు. సల్మాన్ తో జోడి కట్టే అమ్మాయికి కూడా మరి ఆమాత్రం డేరింగ్ ఉండాల్సిందే కదా. సల్మాన్ గాళ్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ ఇందుకు తానేమాత్రం తీసిపోనంటూ గత ఆదివారం అంధోరి నుంచి బాంద్రా వరకూ తన బిజినెస్ మేనజర్ తో కలిసి రిక్షాలో ప్రయాణించి తన సాహసాన్ని చాటుకుంది.
'ఇష్కియా' చిత్రం శివార్లలోని మల్టీప్లెక్స్ లో ప్రదర్శిస్తుండటంతో ఆ చిత్రాన్ని తిలకించేందుకు కత్రినా వెళ్లింది. సినిమా విడిచిపెట్టేసరికి రాత్రి 10.30 అయింది. ఆమె బయటకు వస్తూనే తన డ్రైవర్ ను కాంటాక్ట్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కత్రినా కారు అక్కడి సెల్లార్ లో పార్కింగ్ చేశారు. సెల్ నెటవర్క్ పనిచేయకపోవడంతో కత్రిన పిలుపు డ్రైవర్ కు చేరలేదు. ఈలోగా జనం ఒక్కొక్కరో కత్రినాను గుర్తుపట్టి గుమిగూడటం మొదలైంది. జనం చుట్టుముడితే ఎదురయ్యే డేంజర్ ను కనిపెట్టిన కత్రినా వెంటనే ఆ పక్కనే ఉన్న రిక్షాలో తన మేనేజర్ తో సహా ఎక్కి కూర్చుని ప్రయాణం సాగించింది. కత్రినా బాడీగార్డ్ లు మరో రిక్షాలో ఆమెను అనుసరించారు. మొత్తానికి అభిమానులకు నిరాశ కలిగించిన కత్రిన అంధేరి నుంచి బాంద్రా వరకూ రిక్షా ప్రయాణాన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేసిందట.
News Posted: 9 February, 2010
|