http://www.telugupeople.com/uploads/tphome/images/2010/tabu6.jpg' align='right' alt=''>మెస్మరైజ్ చేసే అందం టబూ సొంతం. ఇటు హిందీలోనే కాకుండా తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టబూ ప్రస్తుతం హిందీలో కేదార్ షిండే దర్శకత్వం వహిస్తున్న 'తో బాత్ పక్కీ' చిత్రంలో నటిస్తోంది. తాజాగా సింగర్ రషీద్ అలీ కోసం ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది టబూకు తొలి మ్యూజిక్ ఆల్బమ్ కావడం విశేషం.
రషీద్ ఇటీవల హిందీలో విజయవంతమైన 'జానే తు జానే న' చిత్రంలో 'కభీ కభీ అదితి' అనే పాట పాడారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ దీనికి సంగీతం అందించారు. కొద్దికాలంగా రషీద్ ఓ మ్యూజిక్ ఆల్బమ్ కు ప్లాన్ చేస్తూ ఇటీవలే టబూను సంప్రదించారు. చక్కటి రొమాంటిక్ ప్లాట్ తో టబూపై ఈ పాటను ప్లాన్ చేస్తున్నట్టు చెప్పగానే ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఆల్బమ్ లో రషీద్ సంగీతంతో పాటు అన్ని పాటలు స్వయంగా పాడనున్నారు. త్రిలోక్ దర్శకత్వంలో ఈ అల్బమ్ రూపొందనుంది. త్వరలోనే ఆల్బమ్ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగనుంది. కెఎం మ్యూజిక్ ద్వారా మరో రెండు నెలల్లో ఈ అల్బమ్ విడుదలవుతుంది.