రఫీ జ్ఞాపకాలకు 'సమాధి' ముంబై: 'ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపి గురుతులు' అంటూ ఓ మనసు కవి అభివర్ణించారు. అయితే ఆ పోయినోళ్ల తీపి గురుతులుగా నిలిచే సమాధులకే దిక్కులేని దౌర్భాగ్య పరిస్థితి ముంబైలోని జుహూ శశ్మాన వాటికలో రాజ్యమేలుతోంది. కళాకారులు అందరి హృదయాల్లోనూ చిరంజీవులు కావచ్చు కానీ మా శ్మశాన వాటికలో సెలబ్రెటీలు...సామాన్యులూ సమానమేనంటున్నారు ఆ శ్మశానవాటిక నిర్వాహకులు. హిందీ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి తెచ్చిపెట్టిన మధుబాల, మహమ్మద్ రఫి, నౌషద్ వంటి దిగ్గజాలు ఇక్కడి సమాధుల్లోనే దీర్ఘనిద్ర పోతున్నారు. ఇప్పుడు అవన్నీ చెదిరిపోయిన జ్ఞాపక చిహ్నాలే. ఆ సమాధులను కూల్చేసి, ఆనవాళ్లు లేకుండా చేశారు.
'కొత్తగా శ్వశాన వాటికకు వచ్చే వారికి జాగా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇస్లామిక్ లా పరంగా కూడా మా చర్య సమర్ధనీయం' అని శశ్మానవాటిక నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. జూహూ గార్డెన్ కు ఎదురుగా ఉన్న ఈ శ్మశానవాటికలో మధుబాల, రఫీ, నౌషద్ వంటి ప్రముఖుల సమాధులతో పాటు నసీమ్ బానో, లుథియాన్వి, ఆలి సర్దార్ జఫ్రి, క్వాజా అహ్మద్ అబ్బాస్, తలత్ మెహమూద్, పర్వీన్ బాబి వంటి పలువురి సమాధులు ఉన్నాయి. సుమారు ఐదేళ్ల క్రితమే
ఈ శ్మశాన వాటికను నిర్వహిస్తున్న ట్రస్ట్ కార్యరంగంలోకి దిగింది. 21 సమాధి పలకలను పగులగొట్టి, మృతదేహాల ఎముకలు, పుర్రెలను సంబంధిత కుటుంబ సభ్యులకు తెలియజేయకుండానే తొలగించింది. ట్రక్కుల నిండా మట్టి తెప్పించి మూడడుగుల ఎత్తు వరకూ పోయించి చదును చేయించారు. ఈ శ్మశాన వాటికలోనే బాలీవుడ్ సెలబ్రెటీ తాహిర్ హుస్సేన్ (అమీర్ ఖాన్ తండ్రి) (అమీర్ ఖాన్ తండ్రి) మృతదేహాన్ని ఈనెల 3వ తేదిన పూడ్చిపెట్టారు.
News Posted: 11 February, 2010
|