వర్మ 'వార్నింగ్'
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/varma8.jpg' align='right' alt=''>రామ్ గోపాల్ వర్మ సినిమా తీసినా, తీయకపోయినా కూడా సంచలనమే. థియేటర్ కు వచ్చే ప్రేక్షకులను భయపెట్టడం అంటే ఆయనకు ఓ సరదా. ఈసారి మాత్రం ప్రేక్షకులను మోతాదుకు మించి భయభ్రాంతులను చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే హారర్ జనర్ లో 'భూత్', 'డర్నా మనా హై', 'డర్నా జరూరీ హై', 'ఫూంక్' చిత్రాలను ఆయన నిర్మించారు. ప్రస్తుతం 'ఫూంక్-2' చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందించి ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఆయన ప్రేక్షకులను మరింత భయపెట్టేందుకు త్రీడీ ఫార్మెట్ లో 'వార్నింగ్' అనే హారర్ థ్రిల్లర్ ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ లో 3డి సినిమాలకు మంచి మార్కెట్ ఉందనీ, తన 'వార్నింగ్' సినిమా తొలి భారతీయ 3డి హారర్ సినిమా కానుందనీ వర్మ ఇటీవల తెలిపారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నందున ఎవరు నటించేది ఇప్పుడే చెప్పలేననీ అన్నారు. ఈ మధ్యనే అమితాబ్ బచ్చన్ తో వర్మ తీసిన మీడియా డ్రామా 'రణ్' ప్రేక్షకుల ముందుకు వచ్చి పేలిపోయింది. అయినప్పటికీ వెరవని వర్మ ఇప్పుడు 'ఫూంక్ 2'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సీమ ఫ్యాక్షన్ నాయకుడు పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా 'రక్తచరిత్ర' తెరకెక్కిస్తున్నారు. వీటికితోడు మాఫియా కథాంశంతో సినిమా తీసి చాలారోజులే అయినందున మళ్లీ 'అంతం', 'సత్య' తరహాలో ఓ మాఫియా సబ్జెక్ట్ ను వర్మ త్వరలో తెరకెక్కించనున్నారు.
News Posted: 15 February, 2010
|