ఇంకా కోలుకోని ఐశ్వర్య
గొంతు ఇన్ ఫెక్షన్ కారణంగా నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఐశ్వర్యారాయ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అభిషేక్ తప్పనిసరి పరిస్థితుల్లో ఐశ్వర్యకు దూరంగా షూటింగ్ బిజీలో ఉండగా, అత్తమామలైన అమితాబ్, జయాబచ్చన్ లు ఐశ్వర్యను కంటికి రెప్పలా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. దీంతో ఐశ్వర్యారాయ్ తరఫున ఇండియా టుడే ఉమన్ సమ్మిట్ అవార్డును అభిషేక్ బచ్చన్ అందుకున్నారు. ఈ విషయాన్ని బిగ్ బి తన బ్లాగ్ లో తెలిపారు.
'ఐశ్వర్య తగినంత విశ్రాంతి తీసుకుంటూ క్రమంగా కోలుకుంటోంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గొంతులోని టాన్సిల్ కింద స్వెల్లింగ్ ఐశ్వర్యను ఎక్కువగా బాధిస్తోంది. నీళ్లు కూడా గుటక వేయకలేకపోతే అంతకంటే బాధ ఏముంటుంది? యాంటిబయోటిక్స్ మాత్రలు పనిచేసి ఇప్పుడు కొంత రిలీఫ్ కనిపిస్తోంది. ఇన్ ఫెక్షన్ తగ్గుముఖం పడుతోంది. ముఖం మీద ఉన్న స్వెల్లింగ్, రేష్ కూడా కనుమరుగవుతున్నాయి. ద్రవాహారం కొద్దిగా తీసుకోగలుగుతోంది. మాట మాత్రం ఇంకా బలహీనంగానే ఉంది' అని అమితాబ్ తన బ్లాగ్ లో కోడలి ఆరోగ్య పరిస్థితిని వివరించారు.
News Posted: 15 February, 2010
|