కెమెరా కంట్లో డినో-కంగనా
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/kangana-kiss.jpg' align='right' alt=''>వాలంటైన్ ఎఫెక్ట్ కావచ్చు. ఇద్దరు కొలీగ్స్ మధ్య ఉండే ఇంటిమసీ కూడా కావచ్చు. ఎలా పిలుచుకున్నప్పటికీ బాలీవుడ్ సెక్సీ గాళ్ కంగనా రనౌత్, సెక్సీ లుకింగ్ గై డినో మోరియా గత శుక్రవారంనాడు జరిగిన సంజయ్ దత్, మాన్యత వివాహ వార్షికోత్సవంలో ఒకరినొకరు ఘాటు ముద్దులతో ముంచెత్తుకుంటూ కలకలం రేపారు. ఈ ఇద్దరూ ముద్దుల మైకంలో మునిగినప్పుడు మెరుపుల్లా ఫ్లాష్ లు మెరిసిన విషయం వీరు గమనించి ఉండ పోవచు. ఇప్పుడు ఆ ఫోటోలు ఓ టాబ్లాయెడ్ లో ప్రచురితమై అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అయితే ఇందులో ఈ ఇద్దరూ లిపి కిస్ లతో మమేకమయ్యారా, బుగ్గలపై ముద్దులతో సరిపుచ్చుకున్నారా అనే స్పష్టత మాత్రం లేదు.
సంజయ్-మాన్యత ఇచ్చిన పార్టీలో శిల్పా శెట్టి, సునీల్ శెట్టి, ఫర్దీన్ ఖాన్ తదితరులతో పాటే డినో, కంగనా పాల్గొన్నారు. ఈ ఇద్దరూ పార్టీ చివరి వరకూ ఎంతో చనువుగా కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా ఉన్నారట. డినో చుట్టూ కంగనా తిరుగుతూ కనిపించిందనీ, సినిమాల గురించి, ముఖ్యంగా ఇద్దరికీ ఇష్టమైన హాలీవుడ్ ఫిలిమ్స్ గురించి ఎక్కువగా వీరి సంభాషణలు నడిచాయనీ ప్రత్యక్ష సాక్షుల కథనం. కంగనా పలు చిత్రాల్లో చేసిన అభినయం గురించి డినో పొగడ్తలతో ముంచెత్తారు. పార్టీ నుంచి బయటపడదామని అనుకున్నప్పుడు ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని ముద్దుల్లో మునిగారు. అనంతరం ఇద్దరూ బయట సిద్ధంగా ఉన్న ఎవరి కార్లలో వారి ఇంటిముఖం పట్టారు. కంగనా ఈ మధ్యనే ప్రియుడికి దూరమైన తరుణంలో డినో పై మనసు పారేసుకుందా, డినో సైతం కంగనా కోసం కొత్తగా ఖాతా తెరచాడా అనేది ఉప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశమవుతోంది.
News Posted: 16 February, 2010
|