http://www.telugupeople.com/uploads/tphome/images/2010/aish1.jpg' align='right' alt=''>'మాతృత్వంలోనె ఉంది ఆడజన్మ సార్ధకం..అమ్మా అనిపించుకొనుటె స్త్రీ మూర్తికి గౌరవం' అని కవి ఏనాడో అమ్మతనంలోని గొప్పతనాన్ని ఆవిష్కరించాడు. అభిషేక్-ఐశ్వర్య దంపతులు త్వరలోనే అమ్మానాన్నల హోదా అందిపుచ్చుకోవాలని బచ్చన్ ఫ్యామిలీని అభిమానించే బాలీవుడ్ జనం అంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ శుభ ఘడియ కోసం ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నారు. అయితే ఐశ్వర్య ప్రస్తుతం స్టమక్ టిబితో చికిత్స పొందుతోందనీ, ఈ కారణంగానే గర్భవతి కావాలనే కోరికను ఎప్పడికప్పుడు ఆమె వాయిదా వేసుకుంటోందనీ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఐశ్వర్యకు తల్లికావాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ ఆమె గర్భందాల్చకుండా జరుగుతున్న జాప్యం బచ్చన్ కుటుంబీకులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని తెలుస్తోంది.
'ఈ మొత్తం వ్యవహారంపై బచ్చన్ కుటుంస సభ్యులు పైకి గంభీరంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అయితే మనసులో మాత్రం ఐష్-అభి సాధ్యమైనంత త్వరగా తల్లిదండ్రులు కావాలని బలంగా కోరుకుంటున్నారు. మనవడు కోసం బిగ్ బి తపిస్తున్నారు. ఆ విషయం అడిగితే మాత్రం ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందంటూ వేదాంత ధోరణి ప్రదర్శిస్తున్నారు' అని ఆ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. వయసు పరంగా చూసినా ఐశ్వర్య ఇప్పుడు 37వ పడిలోకి అడుగుపెట్టడం కూడా ఆందోళనకు ఒక కారణమవుతోందట. అయితే స్టమక్ టీబితో బాధపడుతుండటమే గర్భం దాల్చాలనే ఆమె కోరిక సాకారం కాకపోవడానికి ప్రధాన కారణమని అంటున్నారు. 'స్టమక్ టీబీ నుంచి కోలుకునేందుకు ఆమె తీసుకుంటున్న వైద్యం ఆమె ప్రెగ్నెంట్ కాకుండా నిరోధిస్తోంది. టిబి పూర్తిగా నివారణ అయ్యేంతవరకూ ప్రెగ్నస్నీ కోసం ఆమె రిస్క్ తీసుకోకపోవచ్చు' అని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఐశ్వర్య తర్వగా కోలుకుని, మాతృత్వాన్ని కూడా చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందా...