కళామతల్లి చేతిలో కమల్
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/rajini-kamal.jpg' align='right' alt=''>లోకనాయకుడు అనిపించుకున్న పద్మశ్రీ కమల్ హాసన్ ఇటీవల 50 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకోవడాన్ని ఆయన అభిమానులు ఎంతో సంబరంగా జరుపుకొన్నారు. ఆయన గౌరవార్ధం తమిళనాట ఓ రోడ్డుకు ఆయన పేరు కూడా పెట్టబోతున్నారు. ఇలాంటి సందర్భంలోనే జరిగిన ఓ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం పాల్గొని కళామతల్లికి కమల్ అంటే ప్రత్యేకమైన ప్రేమ అనీ, తమందరికి కంటే నటనను ఆయనకు ఓ మెట్టు ఎక్కువే ఆమె ప్రసాదించిందనీ కొనియాడారు. ఆ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది అభిమానులు రజనీ ప్రసంగానికి హర్షధ్వానాలు చేశారు. అంతటితో రజనీ ఊరుకోలేదు...తన ప్రసంగ సారాంశాన్ని ప్రతిబింబించే ఓ చిత్రపటాన్ని ఇటీవల తయారు చేయించి కమల్ కు కానుకగా పంపారు.
ఈ చిత్రపటంలో కలై తాయ్ (కళామతల్లి) కమల్ ను ఎత్తుకుని ఉంటుంది. రజనీకాంత్, అమితాబ్, మ్మమ్ముట్టి, మోహన్ లాల్, చిరంజీవి వంటి వారంతా ఆమె వెంట అడుగులు వేస్తూ ఉంటారు. రజనీకాంత్ ఔదార్యానికి కమల్ చలించిపోతూ 'నా మిత్రుల ఔదార్యం నన్నెంతో కదిలించింది. మాట రావడం లేదు. స్నేహానికి గుర్తుగా ఇక నుంచి ఈ చిత్తరువును నా కార్యాలయంలో శివాజీ గణేషన్, నగేష్ ల సరస గోడపై ఓ మాస్టర్ పీస్ గా అలంకరిస్తాను' అని చెప్పుకొచ్చారు.
News Posted: 22 February, 2010
|