ముంబయి : అమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. ఈ ముగ్గురూ ముగ్గురే. బాలీవుడ్ లో వీరిదే హవా. అంతేగాక దేశవిదేశాల్లో ఈ ఖాన్ ల త్రయానికి లెక్కలకు సైతం అందని రీతిలో ఎందరో అభిమానులున్నారు. మరి ఈ ముగ్గురు హీరోలు పోటీ పడితే నెంబర్ నంబర్ వన్ స్థానం దక్కించుకునేదెవరు..? ఈ ప్రశ్నకు ఇటీవల సరైన సమాధానం లభించింది. గత మూడు నెలల కాలంగా ఖాన్ హీరోల త్రయం మద్య నంబర్ వన్ స్థానం కోసం ఉత్కంఠమైన పోరు సాగింది. తిరుగులేని అగ్రశ్రేణి హీరోలుగా ప్రఖ్యాతిగాంచిన ఈ ఖాన్ ల సినిమాలు వరుసగా బాక్సాఫీసు ముందు తలపడ్డాయి. దీంతో బాక్సీఫీసు కలెక్షన్లను అనుసరించి నెంబర్ వన్ హీరో ఎవరు అనే అంశంపై బాలీవుడ్ జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ఖాన్ ల త్రయంలో అమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ సినిమా ముందుగా రిలీజైంది. ఆ తరువాత కొద్ది రోజుల వ్యవథిలోనే సల్మాన్ ఖాన్ నటించిన వీర్ సినిమా ప్రక్షకుల ముందు వాలింది. ఇక బాలీవుడ్ బాద్ షా నటించిన మై నేమ్ ఈజ్ ఖాన్ కూడా బాక్సాఫీసు రేస్ లో నిలిచింది. కేవలం మూడు నెలల వ్యవధిలో ముగ్గురు ఖాన్ ల సినిమాలు బాక్సాఫీసు వద్ద తలపడ్డాయి. సల్మాన్ నటించిన వీర్ సినిమా బాక్స్ ఆఫీసులో బాంబు పెట్టేసింది. అభిమానులకు సైతం నిరాశపరచింది. దీంతో రేస్ నుండి ఆ సినిమా వెంటనే వైదొలగింది. ఈ మూడు సినిమాల కథాంశం దేనికదే విభిన్నంగా ఉంటుంది. కానీ రిలీజ్ కు ముందు వివాదాలతో ఉచిత ప్రచారం పొండంలో మూడు సినిమాల పంధా ఒక్కటే.
వీర్ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా బోల్తా కొట్టడంతో అమీర్, షారుఖ్ లే రేస్ లో నిలిచారు. దీంతో మిగిలిన త్రీ ఇడియట్స్, మై నేమ్ ఈజ్ ఖాన్ లు బాక్సీఫీసు బాహాబాహీ తమషా చూపించింది. షారుఖ్ నటించిన మైనేమ్ ఈజ్ ఖాన్ కు ఓపెనింగ్ లో కలెక్షన్ లు వెల్లువెత్తినా రెండో వారం నాటికి ఆదరణ తగ్గింది. దీంతో కలెక్షన్ లు తగ్గి బాద్ షా రేస్ లో కాస్త వెనుకబడినట్లు బాలీవుడ్ వర్గాలు అంచనా వేసాయి. ఇక త్రీ ఇడియట్స్ సూపర్ హీరోగా కలెక్షన్ ల జోరును కొనసాగిస్తుండటంతో అమీర్ ఖాన్ నంబర్ వన్ హీరోగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాలు పోరును ముందే ఊహించిన బాద్ షా ముందే వ్యూహం సిద్ధం చేసారని బాలీవుడ్ గుసగుసలాడుతోంది. అమీర్ నటించిన త్రీ ఇడియట్స్ సూపర్ సక్సెస్ ను అడ్డుకొని తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు యత్నించారని, అందులో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు యజమానిగా ఉన్న షారుఖ్ కావాలనే పాక్ క్రికెటర్లపై వ్యాఖ్యలు చేసి శివసేన వివాదాన్ని కొని తెచ్చుకున్నారని బాలీవుడ్ లో గుసగులు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఖాన్ ల త్రయంలో నంబర్ వన్ ఎవరైనప్పటికీ బాక్సాఫీసు కలెక్షన్ లలో నెంబర్ వన్ మాత్రం అమీర్ ఖాన్ నని తేలింది.