భీష్మించిన బిగ్ బి!
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/amitabh_bachan1.jpg' align='right' alt=''>ముంబై: ఐశ్వర్యా బచ్చన్ ఆరోగ్యం గురించి 'నిరాధార' వార్తను ప్రచురించిన 'ముంబై మిర్రర్' బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో 55వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాబోమని బచ్చన్ ఫ్యామిలీ స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనున్న నేపథ్యంలో బచ్చన్ ఫ్యామిలీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 'ముంబై మిర్రర్', 'ఫిల్మ్ ఫేర్' లు టైమ్స్ గ్రూప్ నకు చెందినవి కావడం విశేషం. 'ముంబై మిర్రర్' సంపాదకుడి నుంచి సరైన వివరణ, క్షమాపణ కోరుతూ బచ్చన్ ఫ్యామిలీ ఒక లీగల్ నోటీసు కూడా పంపింది.
'ఐశ్వర్య ఈ ఈవెంట్ లో పెర్ ఫార్మ్ చేయడం కానీ, తామెవరూ పాల్గొనడం కానీ జరుగదని ఫిల్మ్ ఫేర్ కు తెలియజేశాం' అని తన సొంత బ్లాగ్ bigb.bigadda.com.లో అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. ఐశ్వర్య స్టమక్ టీబితో బాధపడుతోందంటూ తప్పడు వార్తను ప్రచురించిన 'ముంబై మిర్రర్' అదే పేపర్ లో క్షమాపణ చెప్పకపోవడం పట్ల తమ కుటుంబమంతా ఆగ్రహంతో ఉన్నట్టు ఆయన తెలిపారు. 'మేనేజిమెంట్ కు చెందిన కొందరు క్షమాపణ చెప్పి ఉండొచ్చు. అయితే ఇంతవరకూ బహిరంగ క్షమాపణ చెప్పలేదు. పబ్లిక్ లో నన్ను నిందించి ప్రైవేట్ గా సారీ చెబుతానంటే ఎలా' అని అమితాబ్ ప్రశంసించారు. 'టైమ్స్' ఫ్యామిలీతో తమకు మంచి అనుబంధం ఉందనీ, వారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా స్పందించామనీ అన్నారు. బచ్చన్ ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ గా 'పా' చిత్ర దర్శకుడు ఆర్.బాలకృష్ణన్ సైతం ఈ ఈవెంట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. అమితాబ్ నటించిన 'పా' చిత్రం ఐదు కేటగిరిలలో ఫిల్మ్ ఫేర్ అవార్డుల బరిలో ఉంది.
News Posted: 27 February, 2010
|