హోలీ ఆడని బిగ్ బి
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/big-b1.jpg' align='right' alt=''>రంగుల పండుగ హోలీకి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈసారి దూరంగా ఉన్నారు. హోలి పండుగ జరుపుకోవడం లేదని ఆయన తన బ్లాగ్ లో పేర్కొన్నారు. 'ఫిబ్రవరి 13న జరిగిన పుణె జర్మన్ బేకరీ పేలుళ్ల సంఘటనలో మా సొంత మనుషులే ప్రాణాలు కోల్పోయారు. బాధాతప్త హృదయంతో ఈ ఏడాది హోలీకి దూరంగా ఉంటున్నాం' అని ఆయన తెలిపారు. అయితే హోలీ జరుపుకునే దేశప్రజలందరికీ తన హృదయపూర్వకమైన అభినందలని అన్నారు.
జాతి మొత్తాన్ని కుదిపేసిన జర్మన్ బేకరీ లో పేలుళ్ల సంఘటనతో అమితాబ్ కూడా చలించిపోయారు. ఇందులో భాగంగానే ఆయన ఈసారి హోలీ వేడుకకు దూరంగా ఉన్నారు. మరోవైపు తన కోడలు ఐశ్వర్య స్టమక్ కేనర్స్ తో బాధపడుతోందంటూ టైమ్స్ గ్రూప్ కు చెందిన టాబ్లాయిడ్ వార్త ప్రచురించడం అమితాబ్ ను తీవ్ర ఆగ్రవేశాలకు, ఆవేదనకు గురి చేసింది. సదరు టాబ్లాయిడ్ బహిరంగ క్షమాపణ చెప్పాలనీ,ఇదే గ్రూప్ నకు చెందిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమాన్ని తనతో పాటు కుటుంబ సభ్యులంతా బహిష్కరిస్తున్నారనీ అమితాబ్ రెండ్రోజుల క్రితం ప్రకటించారు. అదే క్రమంలో శనివారం రాత్రి ముంబైలో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి కూడా దూరంగా ఉన్నారు. ఈ ఫంక్షన్ లో 'పా' చిత్రంలో నటనకు గాను ఉత్తమనటుడుగా అమితాబ్ కు అవార్డు ప్రకటించారు. అయితే అమితాబ్ హాజరుకాకపోవడంతో ఆయనకు ప్రకటించిన అవార్డును ఇదే చిత్రంలో అమితాబ్ కు తల్లిగా ఉత్తమనటి అవార్డు గెలుచుకున్న విద్యాబాలన్ స్వీకరించారు.
News Posted: 1 March, 2010
|