అసెంబ్లీకి రజనీ, కమల్!
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/kamal-rajani1.jpg' align='right' alt=''>చెన్నై: తమిళ ఇండస్ట్రీలో ఇద్దరూ ఇద్దరే. ఒకరు రజనీకాంత్, మరొకరు కమల్ హాసన్. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరూ కలిసే నటించారు. ఆ తర్వాత ఎవరి దారిలో వారు సూపర్ స్టార్లు అనిపించుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసే అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు కూడా.
అసలు విషయానికి వస్తే ...చెన్నైలో ఇటీవల నూతన సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను నిర్మించారు. ఈ కాంప్లెక్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పరుది ఇలంవళుది స్వయంగా ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్లు పంపిస్తున్నారు. ఆహ్వానితుల జాబితాలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్వయంగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించారు. ఇక ఇలంవళుది నేరుగా రజనీకాంత్, కమల్ హాసనస్ లను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రజనీ, కమల్ కలిసి అసెంబ్లీ హాలు లోకి అడుగుపెడితే ఈ సంబరం అంబరాన్ని అంటుందని చెప్పక్కర్లేదు. ఈనెల 13న సెక్రటేరియట్ నూతన కాంప్లెక్ ప్రారంభోత్సవం జరుగనుంది.
News Posted: 2 March, 2010
|