కోలీవుడ్ న్యూ ఐకాన్!
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/gowtam-balachandar.jpg' align='right' alt='Gowtam-K.Balachandar'>టెక్నికల్ విజార్డ్ గా పేరున్న దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఇప్పుడు డబుల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికితోడు ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో నిష్ణాతుడైన ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ గౌతమ్ ను అభినందిస్తూ ఉత్తరం రాయడం ఆయనను ఆనందార్ణవంలో ముంచెత్తుతోంది. గౌతమ్ ఒకే కథను ఇటు తెలుగులో 'ఏమాయ చేసావే' అంటూ నాగచైతన్య-సమంతతోనూ, తమిళంలో శింబు-త్రిషతో 'విన్నైంతాడి వరువాయ' పేరుతోనూ తీసి ఇటీవల ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. రెండు భాషల్లోనూ ఈ చిత్రం అరుదైన ప్రశంసలు అందుకుంటూ రిలయస్టిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా యువతను ఆకట్టుకుంటోంది. అనూహ్యంగా ఈ చిత్రం తమిళ వెర్షన్ ను ఇటీవల తిలకించిన కె.బాలచందర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా గౌతమ్ మీనన్ ను అభినందిస్తూ ఓ లెటర్ రాశారు.
'ఎంచుకున్న కథలు, వాటిని కన్వెన్సింగ్ గా తెరకెక్కించడంలో ఎస్.ఎస్.వాసన్ అంటే నాకెంతో ఆరాధనా భావం. నేను గౌరవించే మరో వ్యక్తి ఎ.వి.మొయ్యప్ప చెట్టియార్. ఆయన తన టీమ్ పట్ల ఎంతో నమ్మకం ఉంచేవారు. అందుకే ఆయన సినిమాలు సక్సెస్ అయ్యేవి. నా వంతు వచ్చేసరికి పట్టణాలకు చెందిన మధ్యతరగతి వారిని టార్గెట్ చేసుకుని సినిమాలు ఉండేవి. మరో కోణం నుంచి భారతీరాజా సినిమాలు చేశారు. అలాగే మణిరత్నం తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతానికి వస్తే ...నిన్నటి రోజున విన్నైతాండి వరువాయ సినిమా చూశాను. రియల్ లైఫ్ క్యారెక్టర్లు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కనిపించాయి. చెప్పే విధానం, నటుల మధ్య ప్రతిభా పాటవాలను రాబట్టుకోవడం మధ్య చక్కటి బ్యాలెన్స్ కనిపించింది. ముఖ్యంగా మీకూ, మీరు మలిచిన క్యారెక్టర్లకూ మధ్య,. మీకూ, రెహ్మాన్ కు మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. సీన్ బై సీన్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ కట్టిపడేశాయి. తమిళ సినిమాకు ఒక కొత్త ఐకాన్ మీ రూపంలో దొరికింది. మరిన్ని ఎత్తులకు తమిళ సినిమాను తీసుకువెళ్లారని నమ్ముతున్నాను' అంటూ బాలచందర్ తన లేఖలో గౌతమ్ ను అభినందనలతో ముంచెత్తారు. గ్రేట్ ఫిల్మ్ మేకర్ బాలచందర్ మెప్పు పొందిన గౌతమ్ జన్మ ధన్యమైనట్టే మరి...
News Posted: 4 March, 2010
|