శ్రీదేవి పెయింటింగ్స్ వేలం
బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగులోనూ, ఆ తర్వాత బాలీవుడ్ లోనూ నెంబర్ వన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి ఇప్పుడు అంతర్జాతీయ రెప్యుటేషన్ కూడా దక్కించుకోనుంది. అయితే ఇది నటిగా కాకుండా ఆమెలోని పెయింటింగ్ పట్ల ఉన్న పాషన్ రు దక్కుతున్న గుర్తింపే కావడం విశేషం. తనలోని ఆలోచనలు, అభిరుచికి అనుగుణంగా ఆమె వేసిన పెయింటింగ్స్ ను ఇంటర్నేషనల్ ఆర్ట్ ఆక్షన్ హౌస్ లో ఉంచబోతున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును శ్రీదేవి తనకు ఇష్టమైన ఛారిటీ సంస్థకు విరాళంగా అందజేయనుంది.
పెయింటింగ్ పట్ల తనకున్న మక్కువ గురించి శ్రీదేవి ఇంకా పెదవి విప్పనప్పటికీ ఆమె వేసిన పెయింటిగ్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ హౌస్ కు వెళ్లనున్న విషయాన్ని ఆమె భర్త బోనూకపూర్ ధ్రువీకరించారు. ఒక ప్రముఖ అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ లో ఈ పెయింటింగ్స్ ను వేలానికి ఉంచనున్నారనీ, ఏప్రిల్ లో జరిగే వేలంలో వచ్చే సొమ్మును ఛారిటీ సంస్థకు శ్రీదేవి విరాళంగా ఇవ్వనుందనీ ఆయన తెలిపారు. తమకు మంచి మిత్రులైన సల్మాన్ ఖాన్, మనీష్ మల్హోత్రాలకు శ్రీదేవి తలో పెయింటింగ్ ను ఇచ్చిందని చెప్పారు. సహజంగా శ్రీదేవి ప్రతిరోజూ పెయిటింగ్స్ కోసం 4 గంటలు కేటాయిస్తుందనీ, సహజంగా ఇంట్లో పని పూర్తి చేసి, అమ్మాయిల హోమ్ వర్క్ ముగించిన తర్వాత సాయంత్రం వేళలో శ్రీదేవి పెయింటింగ్ కు సమయం కేటాయిస్తుందన్నారు. నటిగా శ్రీదేవి రీఎంట్రీ ఎప్పుడుని అడిగినప్పుడు 'నాలుగో ఏట నుంచే శ్రీ నటించడం మొదలుపెట్టింది. హిందీ ఫిలిమ్స్ లో నెంబర్ వన్ స్థానం పొందిన ఏకైక బాలనటి కూడా ఆమెనే. ఏదైనా ప్రత్యేకత కనపించినప్పుడే ఆమె మళ్లీ నటించే అవకాశాలున్నాయి' అని బోనీకపూర్ సమాధానమిచ్చారు.
News Posted: 11 March, 2010
|