బిగ్ బి టూరిజం ప్రమోషన్
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/amitabh_bachan.jpg' align='left' alt=''>కేరళ టూరిజం ప్రమోషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధనను లెజెండ్రీ నటుడు అమితాబ్ బచ్చన్ అంగీకరించారు. రాష్ట్ర టూరింజం శాఖ మంత్రి కొడియేరి బాలకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. అమితాబ్ ఇప్పటికే గుజరాత్ టూరిజం ప్రమోషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
అమితాబ్ ఇటీవల కేరళలో పర్యటించినప్పుడు కేరళ అందాలను ప్రమోట్ చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. ఆ విషయం తెలుసుకున్న మంత్రి బాలకృష్ణ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ (అమితాబ్ కు సన్నిహితుడు) ద్వారా ఒక లేఖ రాయించారు. అమితాబ్ తన సమ్మతిని తెలియజేస్తూ పంపిన లేఖ తనకు అందిందనీ, త్వరలోనే ఆయనతో సంప్రదింపులు జరుపుతామనీ మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను టూరిజం డైరెక్టర్ కు అప్పగించినట్టు ఆయన చెప్పారు.
News Posted: 12 March, 2010
|