ఏపికి దండిగా కెజి గ్యాస్
గ్యాస్ ఆధారిత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ప్లాంట్లకు పిఎల్ఎఫ్ లో (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)70శాతం గ్యాస్ ను అందిస్తే,అదే సమయంలో ఇతర కంపెనీలకు 60 శాతం పిఎల్ ఎఫ్ ను మాత్రమే అందించాలని సాధికారిక మంత్రుల గ్రూప్ నిర్ణయించింది.'జివికె పవర్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (జివికెపిఐఎల్) కంపెనీకి, ఆఐఎల్ సంస్థకు మధ్య గ్యాస్ సరఫరా ఒప్పందం జరిగింది. సంతకాలు చేయడమే ఆలస్యం.ఆర్ ఐఎల్ తో ఆపైన ఎలాంటి లావాదేవీలు జరగలేదు'ఆని జివికెపిఐఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఐసాక్ ఏ జార్జి తెలిపారు.
అదే సమయంలో ప్రభుత్వ ప్రాధాన్యతా జాబితాలోని రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ జిపిపిఎల్) సంస్థ కూడా ఆర్ఐఎల్ తో ఇంతవరకు చర్చలు జరుపలేదు. ఆర్ జిపిపిఎల్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి చేసే 2,150 ఎమ్ డబ్ల్యూ విద్యుత్ కోసం దాదాపు 2.3 ఎమ్ సిఎమ్ డి గ్యాస్ అవసరమవుతుంది. నాగార్జున ఫెర్టిలైజర్స అండ్ కెమికల్స్, చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, టాటా ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, ఓస్వాల్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ తో సహా 20 కంపెనీలకు ఆర్ ఐఎల్ గ్యాస్ సరఫరా కానుందని ప్రభుత్వం వర్గాలు తెలియజేశాయి. దేశంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ లో 70 శాతాన్ని విద్యుత్, ఎరువుల కర్మాగారాలు వినియోగిస్తున్నాయి.గ్యాస్ సరఫరాలో కొరత కారణంగా వాటి సామర్ధ్యంలో 50-60 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. కెజి బేసిన్ తూర్పు బ్లాక్ లో ఆర్్ఐఎల్ సంస్థ ఫిబ్రవరి చివరినాటికి వాణిజ్య స్థాయిలో గ్యాస్ ను ఉత్పత్తి చేయనుంది. ఈ బ్లాక్ లో 18ఎమ్ సిఎమ్ డిలతో ప్రారంభమై, ఏడాది చివరినాటికి 80 ఎమ్ సిఎమ్ డిల స్థాయికి గ్యాస్ ఉత్పత్తి చేరుకోగలదని ఆర్ ఐఎల్ ప్రకటించింది.
Pages: -1- 2 News Posted: 10 February, 2009
|