'వాలెంటైన్' వైరస్!
ముఖ్యంగా కొన్ని 'స్పీడ్ డేటింగ్' సైట్లు వైరస్ దాడులకు లోను కాగలవని సుప్రీం కోర్టు న్యాయవాది, సైబర్ చట్టం నిపుణుడు పవన్ దుగ్గల్ సూచించారు. 'ఈ సమయంలో అసంఖ్యాకంగా దోషపూరిత స్పైవేర్, వైరస్ లు వెబ్ లో తిరుగాడుతుంటాయి. నెట్ వర్క్ లు వీటికి లోనయ్యే ప్రమాదం ఉంది. యువజనులే ప్రధానంగా వీటి వల్ల నష్టపోతుంటారు. ఎందుకంటే ఇదే సమయంలో వెబ్ ద్వారా కార్యకలాపాలను వారే నిర్వర్తిస్తుంటారు' అని దుగ్గల్ పేర్కొన్నారు.
ఈ వారం స్కామ్ ల కోసం జాగ్రత్తగా చూడవలసిందిగా ఇంటర్నెట్ యూజర్లను వెబ్ సెన్స్ సెక్యూరిటీ లాబ్స్ హెచ్చరించింది. అమాయక సర్ఫర్లను కబళించడానికి పొంచి ఉన్న సైబర్ నేరస్థులు ఇటువంటి అవకాశాలను వినియోగించుకుంటారని వెబ్ సెన్స్ సంస్థలో సార్క్, ఇండియా విభాగం రీజనల్ డైరెక్టర్ సురేంద్ర సింగ్ పేర్కొన్నారు. అటువంటి స్కామ్ లు సాఫ్ట్ వేర్ లో భద్రతాపరమైన వెలితి, నకిలీ సైట్లు, పెడదారి పట్టించే పద్ధతులపై ఆధారపడుతుంటాయని, ప్రతి సంవత్సరం ఇదే కాలంలో ఇవి సర్వసాధారణంగా కనిపిస్తుంటాయని ఆయన తెలిపారు.
Pages: -1- 2 -3- News Posted: 12 February, 2009
|