'వాలెంటైన్' వైరస్!
ఇప్పటికే పెక్కు ఫిషింగ్ ఇ-మెయిల్స్ విహారం సాగిస్తూ ప్రేమను లేదా డేటింగ్ అవకాశాలను ప్రోత్సహిస్తున్నాయి. మాల్ వేర్, అడల్ట్ డేటింగ్, 'హెల్త్ కేర్' స్పామ్ కు అవకాశం కలిగిస్తున్న పలు నకిలీ వాలెంటైన్స్ డే సైట్లను గుర్తించినట్లు వెబ్ సెన్స్ తెలియజేసింది. వాలెంటైన్స్ డే ఇ-మెయిల్ స్పామ్ లలో కనిపించే ట్రోజన్ వైరస్ వంటి మామూలు అనుమానితులలో వీటిదే అగ్రస్థానం. అయితే, జనం ఈ ఎత్తుగడల పట్ల మరింత చైతన్యవంతులు అవుతున్నారని సురేంద్ర సింగ్ చెప్పారు. 'ఈ పద్ధతిలో జనాన్ని మోసగించడం అంతకంతకు కష్టం అవుతున్నది' అని ఆయన అన్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు బహుళ జనాదరణను, 'స్నేహపూర్వక' సందేశాల ద్వారా యూజర్ ను తప్పుదోవ పట్టించే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ సైట్లు కూడా వీటికి లోను కాకుండా ఉండలేవని ఆయన పేర్కొన్నారు.
వైరస్ లను కలిగించి, మాల్ వేర్ ను విస్తరించే నకిలీ సైట్లను సందర్శించేట్లుగా యూజర్లను ప్రలోభపెట్టడానికి ట్విట్టర్, ఫేస్ బుక్, మైస్పేస్ వంటి పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను స్పామర్లు ఉపయోగించుకుంటున్నారు. బ్లాగ్ లు, వ్యాఖ్యల పేజీలను కూడా వారు లక్ష్యం చేసుకుంటున్నారు. అత్యంత పాపులర్ అయిన 100 వెబ్ సైట్లలో 70 శాతం దోషపూరిత సమాచారం లేదా అసలు సిసలైన సైట్ల నుంచి ఇతర సైట్లకు జనాన్ని మళ్ళించేందుకు ముసుగు సమాచారం కలిగి ఉన్నాయని సురేంద్ర సింగ్ తెలిపారు.
Pages: -1- -2- 3 News Posted: 12 February, 2009
|