రెడీమేడ్ మహా చౌక
కారణమేమిటిః
అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. ఏడాది మొత్తం అమ్మకాల్లో 40 శాతంగా ఉండే అక్టోబర్-డిసంబర్ మధ్యకాలంలోని అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 25 శాతం క్షీణించాయి. పేరుకు పోయిన నిల్వల్ని వచ్చే సీజన్ ప్రారంభమయ్యే లోపు వదిలించుకోకపోతే వర్కింగ్ కేపిటల్ కష్టమైపోతుంది. తర్వాతి సీజన్ కోసం సిధ్దపడేందుకు స్టాకుల్ని సాధ్యమైనంత త్వరగా వదిలించుకునేందుకు రిటైల్ సంస్థలన్ని భారీ డిస్కౌంట్ల బాట పట్టాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతీసింది.దాంతో భారత రిటైల్ వ్యాపారం ఘోరంగా దెబ్బతింది.
ఈ ఆర్ధిక సంవత్సరంలో మందగించిన స్తూల దేశీయోత్పత్తి కారణంగా స్టోర్ గ్రోత్ కూడా గణనీయంగా దెబ్బతింటుందని 'ఫిచ్'అనే రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది.నిల్వలను వదిలించుకునే ఉద్దేశ్యంతో వినియోగదారలను డిస్కౌంట్ల వరాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు జరిగుతాయి. దాంతో లాభాలు మరింతగా క్షీణించనున్నాయని ఆ సంస్థ అంచనా వెల్లడించింది. సాధారణంగా రిటైల్ సంస్థలు 3035 శాతం ఆదాయం చూసుకుంటాయి. ఆ దృష్ట్యా తమ సరుకుల్లో 60 శాతాన్ని పూర్తి స్థాయి ధరకు అమ్మితే, మిగిలిన సరుకుల్ని 20-25 శాతం డిస్కౌంట్ కు అమ్ముకుంటాయి. అయితే ఈ సీజన్లో మెజారిటీ సరుకుల్ని డిస్కౌంట్ కు అమ్మివేయడం వలన, లాభాలు 10-15 శాతం మధ్య ఉన్నాయని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.
'లిల్లీపుట్'కిడ్స్ వేర్ సంస్థ తాను పెట్టిన పెట్టుబడి నిలబడి పోవడంతో, వర్కింగ్ కేపిటల్ కోసం దాదాపు 70 శాతం డిస్కౌంట్ కు తన రెడీమేడ్ దుస్తులను అమ్మివేస్తోంది. పెట్టుబడి ఇరుక్కుపోవడంతో డబ్బు కొరత సమస్య వచ్చి పడింది. దాంతో భారీ డిస్కౌంట్ లను ప్రకటించి స్టాక్ ను వదిలించుకోక తప్పదు. ఈ ఆర్ధిక సంవత్సరంలో లిల్లీపుట్ సంస్థ దాదాపు 275 స్టోర్స్ ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 200 స్టోర్స్ ను మాత్రమే ప్రారంభించగలదు. అమ్మకాలు లేక, స్టాక్ మిగిలి పోయి లిక్విడిటీ సమస్య ఏర్పడటంతో 75 స్టోర్స్ ను ఏర్పాటు చేయలేక పోతోంది. ఏది ఏమైనా వచ్చే సీజన్ లో పోటీ పడేందుకు రిటైల్ సంస్థలు ఈ సీజన్ లో లాభాలను పోగొట్టుకోక తప్పడంలేదు.
Pages: -1- 2 News Posted: 12 February, 2009
|