క్రికెటర్లకు పరిశుభ్రత పాఠం!
కోలకతా: భారత క్రికెట్ జట్టు క్రితం సారి (2002 డిసెంబర్ లో)న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఎదురైన చేదు అనుభవం పునరావృతం కాకుండా చూసేందుకు ఈసారి పర్యటనకు వెళుతున్న భారత క్రికెట్ జట్టు సభ్యుల బూట్లు మొదలైనవాటిని జట్టు మేనేజర్ నిరంజన్ షా స్వయంగా తనిఖీ చేయవచ్చు. 2002 డిసెంబర్ లో జట్టు న్యూజిలాండ్ చేరుకోగానే జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీకి, హర్భజన్ సింగ్ కు విమానాశ్రయంలో జరిమానా విధించారు.
'ఈసారి క్రీడాకారులు తాము ఇప్పటికే ఉపయోగించిన పాదరక్షల పరిశుభ్రత విషయంలోను, ఫిబ్రవరి 20న ఆక్లాండ్ చేరుకున్న తరువాత సంతకం చేసే డిక్లరేషన్ల విషయంలోను అత్యంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది' అని అభిజ్ఞ వర్గాలు శనివారం సూచించాయి. క్రితం పర్యాయం కూడా జట్టు ఆక్లాండ్ లోనే విమానం దిగింది.
వాస్తవానికి, ఉపయోగించిన పాదరక్షల 'పరిశుభ్రత' గురించి, డిక్లరేషన్లు పక్కాగా ఉండవలసిన ఆవశ్యకత గురించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని జట్టుకు అందజేసే చేయదగిని, చేయకూడని పనుల జాబితాలో స్పష్టంగా సూచించవచ్చు. ధోని నాయకత్వంలోని జట్టు న్యూజిలాండ్ లో సుమారు ఎనిమిది వారాలు గడుపుతుంది. ఈ పర్యటనలో భాగంగా జట్టు రెండు ట్వంటీ20 మ్యాచ్ లు, ఐదు ఒడిఐలు, మూడు టెస్ట్ లు ఆడుతుంది.
Pages: 1 -2- -3- News Posted: 15 February, 2009
|