క్రికెటర్లకు పరిశుభ్రత పాఠం!
అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం, చెన్నైలో శుక్రవారం సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం ఈ 'పరిశుభ్రత' అంశం ప్రస్తావనకు వచ్చింది. బిసిసిఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మూడు తరహాల పోటీలకు 16 మంది సభ్యులతో వేర్వేరు జట్లను ప్రకటించిన విషయం విదితమే. 'ప్రతి ఒక్కరూ నవ్వులలో తేలిపోయారు. కనీసం తన క్రికెట్ పాదరక్షలు కొత్తవేనని, అందువల్ల తనకు జరిమానా విధించడానికి, ఫలితంగా జట్టుకు ఇరకాట స్థితి ఎదురుకావడానికి అవకాశం ఉండదని కెప్టెన్ ధోని చెప్పాడు' అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఆ పర్యటనలో చేదు అనుభవానికి లోనైన ఇద్దరిలో సౌరవ్ గంగూలి ఇప్పుడు రిటైర్ కాగా హర్భజన్ సింగ్ ఈసారి స్పిన్ విబాగానికి సారథిగా ఉంటున్నాడు. అతను 2002 ఆక్లాండ్ ఉదంతాన్ని మరచిపోయి ఉండడనే అనుకోవాలి. కాగా, న్యూజిలాండ్ వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆ జరిమానాలతో వేసిన బౌన్సర్ ఆ పర్యటనలో అపశకునంలా పరిణమించి జట్టు ఘోరంగా విఫలమైంది. ఈ పర్యాయం అటువంటి సంఘటనలేవీ చోటు చేసుకోకుండా చూసుకుంటే పర్యటన ఆనందప్రదంగా సాగవచ్చు.
Pages: -1- -2- 3 News Posted: 15 February, 2009
|