క్రికెటర్లకు పరిశుభ్రత పాఠం!
క్రితం సారి న్యూజిలాండ్ లో పర్యటనకు భారత జట్టు వెళ్ళినప్పుడు అప్పటి కెప్టెన్ (ఇప్పుడు రిటైరైన) సౌరవ్ గంగూలికి, హర్భజన్ సింగ్ కు తాము ఉపయోగించిన పాదరక్షలను నాలుగు జతలు తీసుకువస్తే మూడు అనే తప్పుగా ప్రకటించినందుకు, వాటిపై గడ్డి పరకలు అంటుకుని ఉన్నందుకు ఒక్కొక్కరికి 200 డాలర్లు జరిమానా విధించిన విషయం విదితమే. న్యూజిలాండ్ లోకి ప్రవేశించే ప్రాంతాలలో తనిఖీ బాధ్యతలను నిర్వర్తిస్తుండే ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆ జరిమానాలను విధించింది. ఆ మంత్రిత్వశాఖ మరీ కఠినంగా వ్యవహరిస్తుంటుందనే పేరు కూడా ఉంది. (అయితే, కొందరు ఆ వైఖరిని ఎగతాళి చేస్తుంటారు కూడా). ఆ సమయంలో న్యూజిలాండ్ లో 'ఫుట్ అండ్ మౌత్', 'మ్యాడ్ కౌ' వ్యాధులు ప్రబలడంతో బయో-సెక్యూరిటీకి సంబంధించిన తనిఖీలు మరీ కఠినంగా ఉంటుండేవి.
'అది పొరపాటే తప్ప మరేమీ కాదు. అయినా వాడకంలో ఉన్న పాదరక్షలకు గడ్డిపరకలు, మట్టి అంటుకుని ఉండడం అసాధారణమేమీ కాదు కదా' అని అప్పుడు సౌరవ్ వ్యాఖ్యానించాడు. ఆ పర్యటనకు జట్టు మేనేజర్ గా ఉన్న నాథూ రామ్ చౌదరి ఇది ఉద్దేశపూర్వంగా చేసింది కాదు కనుక జరిమానాలను రద్దు చేయవలసిందిగా అధికారులను ప్రాథేయపడ్డారు. కాని ఆయన అభ్యర్థనలను వారు పట్టించుకోలేదు. జరిమానా విధిస్తున్న ఇద్దరిలో ఒకరు భారత జట్టు కెప్టెన్ అన్న వాదనను కూడా వారు పట్టించుకోలేదు. వాడకంలో ఉన్న పాదరక్షలు పరిశుభ్రంగా కనుక లేకపోతే న్యూజిలాండ్ ప్రధానిని కూడా వాటితో వెళ్ళనివ్వబోమని అధికారులు చౌదరికి స్పష్టం చేశారు.
Pages: -1- 2 -3- News Posted: 15 February, 2009
|