బాలీవుడ్ 'ఎక్స్'ప్లోజన్
హిందీ సినిమాలను గ్లోబల్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు బాలీవుడ్ పరిశ్రమ ఇటీవల కాలంలో పలు హాలీవుడ్ స్టూడియోస్ తో వ్యూహాత్మక ఒప్పందాలు, నిర్మాణ భాగస్వామ్యం నెరపుతోంది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తుండటంతో పలువురు పాశ్చాత్య ముద్దుగుమ్మలు బాలీవుడ్ లోకి అడుగుపెడుతూ హాటెస్ట్ అందాలను ప్రదర్శించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ ఏడాది తమ సోయగాలను ప్రేక్షకుల ముందు ఒలకబోసేందుకు ముస్తాబవుతున్న ముద్దుగుమ్మల్లో మెక్సికన్ బ్యూటీ బార్బరా మోరి, మాజీ మిస్ శ్రీలంక జాక్విలిన్ ఫెర్నాండెజ్ , ప్రస్తుత మిస్ యు.కె. లిసా లజారుస్, బ్రిటిష్ నటి ఫ్లోరెన్స్ బ్రుడెనెల్-బ్రూస్ ఉన్నారు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజా చిత్రం 'కైట్స్' లో ఆయనకు జోడిగా బార్బరా మోరి నటిస్తోంది. అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో రాకేష్ రోషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హృతిక్, బార్బరాల మధ్య ముద్దు సన్నివేశం ఉన్నట్టు వస్తున్న వార్తలు ఇప్పుడు మీడియోలో కూడా హాట్ టాపిక్ అయింది. బార్బారా తన వలువలను పక్కనపెట్టి హృతిక్ తో ఓ శృంగార సన్నివేశంలో నటించిందనే ప్రచారమూ జరుగుతోంది. బాలీవుడ్ లో అడుగుపెట్టడం, ఇక్కడ సినిమాలకు పనిచేస్తుండం చాలా సంతోషంగా ఉందని బార్బరా అంటోంది. ఆమె రాక సినీగోయెర్స్ కూడా హ్యాపీనే మరి. ఆమె తర్వాత జనాలకు కనికట్టు కట్టేందుకు జాక్విలిన్ కూడా సిద్ధంగానే ఉంది. మోడలింగ్ నుంచి నటిగా మారిన జాక్విలిన్ బాలీవుడ్ దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. ఆమెకు వివేక్ ఒబెరాయ్ తో సంబంధాలున్నాయనే వందతులు కూడా కొద్దికాలంగా వినిపిస్తున్నాయి. వివేక్, తానూ మంచి ఫ్రెండ్స్ మని జాక్విలిన్ నమ్మబలుకుతోంది. ప్రసుతం ఆమె సుజయ్ ఘోష్ 'అలాదీన్'లో నటిస్తుండటంతో ఈ వదంతుల జోరు తగ్గింది. ఈ చిత్రంల అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 16 February, 2009
|