బాలీవుడ్ లో విదేశీ 'ఎక్స్'ప్లోజన్
ఇక 21 ఏళ్ల లండన్ పాప లిసా ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరసన 'వీర్ ' చిత్రంలో నటిస్తోంది. చిన్నప్పుడే తాను టీవీల్లో బాలీవుడ్ సాంగ్స్ చూసి వాటికి అనుగుణంగా డాన్స్ చేసేదాన్ననీ, ఇప్పుడు ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందనీ లిసా చెబుతోంది. బాలీవుడ్ చాలా పెద్ద పరిశ్రమ అనీ, పశ్చిమ దేశాల్లో కూడా బాగా పాపులారిటీ తెచ్చుకుంటోందనీ, నటిగా తనకు మంచి బ్రేక్ లభించే ఇలాంటి అరుదైన అవకాశాన్ని ఎంత మాత్రం వదులుకునేది లేదనీ ఆమె స్పష్టం చేస్తోంది.
సైఫ్ అలీ ఖాన్ సైతం తన సొంత నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న 'లవ్ ఆజ్ కల్ ' చిత్రంలో బ్రిటిష్ నటి ఫ్లోరెన్స్ ను ఎంచుకున్నారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పడుకునేతో సైఫ్ జతకడుతున్నారు. మొత్తానికి...గ్లామర్ బ్యూటీస్ ను సాంగ్ సీక్వెన్స్ లలోనే ఎక్కువగా ఉపయోగించుకోవడమో బాలీవుడ్ లో కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. విదేశీ హాటెస్ట్ భామలకు 'మీటియర్' రోల్స్ కూడా దక్కుతున్నాయి.
Pages: -1- 2 News Posted: 16 February, 2009
|