సత్యం అధికారులకు ఉద్వాసన
ఉదాహరణకు మాన్యు ఫాక్చరింగ్ వర్టికల్స్ లోని ఆరు సబ-వర్టికల్స్ లో పని చేసే వర్క గ్రూప్ లీడర్లు తమ వర్టికల్ పరిధి మేరకు తామే స్వతంత్రగా నిర్ణయాలు చేస్తున్నారు. అందుకు భిన్నంగా ఈ వర్క గ్రూపుల నుండి అత్యధిక పనిని రాబట్టడంపై వారు కేంద్రీకరించాల్సి ఉంటుంది. 'రీ గ్రూపింగ్ ద్వారా కంపెనీకి చెందిన తార్కిక అంశాలను చక్కబెట్టుకోవడమే కాకుండా నాయకత్వ స్థానాల్లోకి యువ తరాన్ని తీసుకరావడం జరుగుతుంది.' అని సత్యం గ్లోబల్ కమ్యూనికేషన్స్ అధిపతి టి హరి తెలియజేసారు. కొంత మంది మధ్యంతర స్థాయి ఉద్యోగులను కీలక వర్టికల్స కు అధిపతులుగా పదోన్నతి పొందే అవకాశముంది. దాంతో వారు అంతకు ముందు బాధ్యత వహిస్తున్న ఉద్యోగుల్ని కలుపుకుని మరింత సమన్వయంతో పని చేయించేందుకు అవకాశముంటుంది.
ప్రత్యేకించి కింది, మధ్యంతర స్థాయిల్లో పనిచేసే సిబ్బంది సంఖ్యను బోర్డు సమీక్షించడంలేదు. సత్యం కంప్యూటర్స్ సైట్లో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని కంపెనీ ప్రధాన ఖాతాదారు 'కోక్' తీసుకునేందుకు చూస్తోంది. అదే విధంగా హెచ్1బి వీసా సంస్థ కూడా బోర్డు సమావేశంలో పెద్ద చర్చనీయాంశం కానుంది. అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ గా సత్యం కంప్యూటర్స్ లో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులు వేరే కంపెనీల్లో చేరేందుకు సిద్ధపడుతున్నారు. ఈ విషయంపై బోర్డు తీవ్రంగా చర్చించనుందని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 17 February, 2009
|