శామ్ సంగ్ సోలార్ ఫోన్
బ్లోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్, బెరిలియమ్, ఫ్తాలేట్ లాంటి విషపదార్దాలు లేకుండా ఈ ఫోన్ ను తయారు చేసారు. పర్యవరణ పరిరక్షణ ఉత్పత్తుల్లో ఈ మొబైల్ ఫోన్ అత్యాధునికమైనది. బ్లూ ఎర్త్ మొబైల్ పోన్ లో అనేక కొత్త తరహా ఫీచర్స్ తో పాటు పాత ఫీచర్స్ కూడా కొత్త తీరులో రూపొందాయి. వినియోగదారుల అవసరాలను బట్టి ఈ ఫోన్ ఫీచర్స్ రూపొందాయి. స్క్రీన్ బ్రైట్ నెస్ ను ఎంచుకోవడం అతి సులభం, బ్యాక్ లైట్ కాలాన్ని, బ్లూటూత్ ను అతి తక్కువగా విద్యుత్ ను వినియోగించుకునే తీరులో వినియోగించవచ్చు. ఇందుకోసం 'ఎకో మోడ్' ను ఫోన్ లో ఎంచుకోవచ్చు. అదే విధంగా 'ఎకో వాక్' ఫంక్షన్ ద్వారా ఫోన్ లోని 'పెడో మీటర్' వినియోగదారుని నడకను అంచనా వేస్తుంది. ఆ అంచనా ద్వారా వినియోగదారుడు ఆ దూరాన్ని ఏదైనా వాహనంలో వెళితే విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణాన్ని ఆదా చేసే పరిమాణాన్ని మొబైల్ తెలియజేస్తుంది. ఈ ఫోన్ లో ఉండే ఫంక్షన్ ద్వారా చెట్లను పరిరక్షించే సంఖ్యను కూడా అంచనా వేసేందుకు అవకాశముంది.
బ్లూ టూత్ ఫోన్ ప్యాకేజింగ్ కూడా చాలా చిన్నదిగా, తేలికగా ఉంటుంది. ఈ ప్యాకేజిని కాగితం రిసైక్లింగ్ ద్వారా తయారు చేసారు. 5 స్టార్ ఎనర్జి ఎఫిషియంట్ చార్జర్ ఉంటుంది. ఇందులో 0.03 వాట్స్ విద్యుత్ ను సైతం నిల్వ ఉంచుకోవచ్చు. మొబైల్ డివైజ్ చార్జర్ లో విద్యుత్ వినియోగ రేటింగ్ ను తెలిపే సదుపాయం ఉంటుంది. అతి తక్కువ వినియోగాన్ని సైతం ఇందులో నమోదు చేసుకునే అవకాశముంది. శామ్ సంగ్ రూపొందించిన మొబైల్ ద్వారా భవిష్యత్ పట్ల కంపెనీ చేసిన చిన్న వాగ్దానాన్ని నేరవేర్చినట్లవుతుందని శ్యామ్ సంగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెకె షిన్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 17 February, 2009
|