కాంగ్రెస్ తొలి జాబితా
హైదరాబాద్ : అభ్యర్థుల ఎంపికలో ప్రదాన రాజకీయ పార్టీల కసరత్తు ఊపందుకుంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు పూర్తయింది. ఈసారి కాంగ్రెస్ మొత్తం అసెంబ్లీ స్థానాలన్నిటికి పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే 180 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరెడ్డి ఇటీవల జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో ప్రకటించారు. యాభై నుంచి అరవై మంది వరకు సిటింగ్ ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో మళ్ళీ టిక్కెట్లు వచ్చే అవకాశం లేదు. కొంతమంది మంత్రులకు కూడా టిక్కెట్లు వచ్చే సూచనలు లేవు. మరి కొందరు మంత్రులు తమ నియోజకవర్గాలను మార్చుకోవాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు రద్దయినా రిజర్వేషన్ కేటగిరి మారినా కొత్త నియోజకవర్గాల గురించి పరిశీలించాలి తప్ప, అవే నియోజకవర్గాలు కొనసాగిన పక్షంలో మంత్రులకు కొత్త నియోజకవర్గాలకు టిక్కెట్టు ఇచ్చే ప్రశ్న లేదని ముఖ్యమంత్రి ఖరాకండిగా చెప్పారు. ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాల కథనం ప్రకారం ఇప్పటివరకు ప్రాధమిక కసరత్తు పూర్తయిన జాబితా జిల్లా వారీగా ఇలా ఉంది.
ఆదిలాబాద్ జిల్లా :- నిర్మల్ : ఎ. ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ : సి.రామచంద్రారెడ్డి, సిర్పూర్ : కోనేటి కోనప్ప, చెన్నూరు, జి.వినోద్.
అనంతపురం జిల్లా :- పుట్టపర్తి: జానకి రామయ్య, రాయదుర్గం : పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, ఉరవకొండి: విశ్వేశ్వర్ రెడ్డి, అనంతపురం: ప్రస్తుత ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి కుమారుడు, కళ్యాణ దుర్గం: ఎన్.రఘువీరారెడ్డి, రాప్తాడు: నల్లపరెడ్డి, ధర్మవరం: వెంకట్రాంరెడ్డి. తాడిపత్రి, జెసి.దివాకర్ రెడ్డి,
కరీంనగర్ జిల్లా:- జగిత్యాల: టి.జీవన్ రెడ్డి, కోరుట్ల : జె.రత్నాకరరావు, వేములవాడ: శ్రీనివాస్, మంధని: దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.
కర్నూలు జిల్లా:- ఆళ్ళగడ్డ: గంగుల ప్రతాప్ రెడ్డి, శ్రీశైలం: ఏరాసు ప్రతాపరెడ్డి, కర్నూలు: టిజి.వెంకటేశ్, పాణ్యం: కె.రాంభూపాల్ రెడ్డి, నంద్యాల: శిల్పా మోహన్ రెడ్డి, డోన్: కోట్ల సుజాత.
ఖమ్మం జిల్లా: - ఖమ్మం: జలగం వెంకట్రావు, సత్తుపల్లి: సంభాని, చంద్రశేఖర్, కొత్తగూడెం: వనమా వెంకటేశ్వరరావు, మధిర: మల్లు భట్టి విక్రమార్క.
Pages: 1 -2- -3- News Posted: 19 February, 2009
|