రాహుల్ కాదు, సింగే మా కింగ్!
1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణానంతరం ఇందిరా గాంధీని రాజ్యసభకు నామినేట్ చేసి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆమెను సమాచార, ప్రసార శాఖ మంత్రిగా చేర్చుకున్నారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు కె. కామరాజ్ నాడార్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఇందిరా గాంధీని ప్రధాని పదవికి ఎంపిక చేశారు.
రాజీవ్ గాంధీ రాజకీయ జీవితంలో సంభవించినట్లుగా 'అకస్మాత్ ఉత్థాన, పతనాలకు' రాహుల్ ను గురి చేయరాదని సోనియా గాంధీ కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. 'ముందు అర్హత సంపాదించు, ఆ తరువాత ఆకాంక్షించు' అనే సిద్ధాంతాన్ని సోనియా విశ్వసిస్తున్నందున తొలుత ప్రాథమిక స్థాయిలో ఢక్కామొక్కీలు తిన్న తరువాతే ఆయన పురోగమించాలని ఆమె కోరుకుంటున్నారు' అని ఆ వర్గాలు తెలిపాయి.
ఇందిరా గాంధీ వలె కాకుండా రాజీవ్ గాంధీ సునాయాసంగా రాజకీయ అరంగేట్రం చేసి అద్భుత రీతిలో ఉన్నత స్థాయికి ఎదిగారు. సోదరుడు సంజయ్ గాంధీ మరణించిన ఏడాది తరువాత 1981లో రాజీవ్ కాంగ్రెస్ లో చేరి అమేథి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన తన తల్లికి రాజకీయ సలహాదారు అయ్యి, యువజన కాంగ్రెస్ కు అధ్యక్షుడుగా నియుక్తుడయ్యారు. ఇందిరా గాంధీ హత్యానంతరం రాజీవ్ ఎన్నికలలో కాంగ్రెస్ కు సారథ్యం వహించి అఖండ విజయం సంపాదించి ప్రధానిగా ఎన్నికయ్యారు. కానిక ఐదు సంవత్సరాలలోనే అధికారాన్ని కోల్పోయారు. ఆ తదుపరి ఎన్నికల సమయంలో ఆయన హత్యకు గురయ్యారు.
Pages: -1- 2 -3- News Posted: 19 February, 2009
|