నాగార్జునకు రిలయన్స్ గ్యాస్
గ్యాస్ ను అమ్మవలసిన 11 ఎరువుల కర్మాగారాల జాబితాను ఆర్ఐఎల్ సంస్థకు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ అందజేసింది. ఎన్ఎఫ్ సిఎల్ తోపాటు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ (ఇఫ్కో), నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ ఎఫ్ఎల్), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, చంబల్ ఫెర్టిలైజర్స అండ్ కెమికల్స్ సంస్థలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్ఐఎల్ గ్యాస్ అమ్మవలసి ఉంటుంది. కాకినాడ వద్దనున్న గాడిమొగ గ్యాస్ టెర్మినల్ నుండి రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్ పోర్టేషన్ కార్పొరేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నిర్మించిన కాకినాడ-హైదరాబాద్, ఉరాన్-అహ్మదాబాద్ పైప్ లైన్ల ద్వారా పై కర్మాగారాలకు ఆర్ఐఎల్ గ్యాస్ సరఫరా అవుతుంది.
ఈ ఫాక్టరీలకు గ్యాస్ ను సరఫరా చేసే కార్యకలాపాన్ని ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ నిర్వహిస్తుంది. గ్యాస్ ఆధారిత కర్మాగారాలుగా మారడంతో ఎరువుల ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఒక టన్ను యారియాను తయారు చేసేందుకు ఒక ఎరువుల కర్మాగారం దాదాపు 24 ఎమ్ బిటియుల విద్యుత్ ను వినియోగిస్తోంది. ఈ వినియోగంలో 8 ఎమ్ బిటియుల విద్యుత్ ను గ్యాస్ ద్వారా పూరించగల్గితే, ఒక టన్ను యూరియా ధరపై 28 డాలర్లు ఆదా అవుతాయి.
Pages: -1- 2 News Posted: 19 February, 2009
|