గోర్షకోవ్ నౌక మరమ్మతులు, ప్రయోగాత్మక పరిశీలనల కోసం 2.9 బిలియన్ల డాలర్లను చెల్లించవలసి ఉంటుందని చివరి ఒప్పందంపై ఫిబ్రవరి 10న మెద్వెదేవ్ సంతకాలు చేసారు. ఈ లావాదేవీ చర్చించేందుకు న్యూడిల్లీకి వచ్చిన రష్యా ప్రతినిధి బృందం ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ ప్రతినిధి బృందానికి ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ-టెక్నికల్ కోపరేషన్ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ సారధ్యం వహిస్తున్నారు.ఆ బృందంలో సెవ్మార్ష షిప్ యార్డ్ డైరెక్టర్ జనరల్ నికొలయ్ కలిస్ట్రటోవ్ కూడా ఉన్నారు. గత ప్రతిపాదన విషయంలోనే మధ్యస్తం కోసం భారత్ పాకులాడుతుండగా, అదనంగా ధర పెంచుతూ రష్యా మరోసారి బాంబు పేల్చింది.
ఈ కొనుగోలు ఒప్పందానికి గాను భారత్ ఇప్పటికే 500 మిలియన్ డాలర్లను చెల్లించింది. ఈ ఒప్పందంపై జరుగుతున్న చర్చలతో సంబంధం లేకుండా నౌకాశ్రయంలో ఇప్పుడు జరుగుతున్న మరమ్మతులకు గాను సెవ్మార్ష్ 190 మిలియన్ డాలర్లను చెల్లించాలని భారత ప్రభూత్వాన్ని కోరింది. కొనగోలు ఒప్పందంపై రష్యా ఊగిసలాట ద్వైపాక్షి సంబంధాల్లో వివాదం సృష్టించింది. 2012 నాటికి యుద్దనౌకను అందచేస్తానని రష్యా దృఢంగా చెబుతోంది. ఈ యుద్దనౌక ప్రయోగాత్మక ప్రయత్నాలను వచ్చే సంవత్సరంలో మొదలవుతాయని రష్యా బృందం తెలిపింది. మరమ్మతు చేసిన యుద్ద నౌక ప్రయోగాలకు సమకాలీన ఇంధన ధరలకు అనుగుణంగా 500 మిలియన్ డాలర్లు ఖర్చుకానున్నట్లు ఆ బృందం తెలిపింది.
ఈ మొత్తం ఒప్పందంలో రష్యా ఎలాంటి ఖర్చును భరించేందుకు సిద్ధంగా లేదు. అడ్మిరల్ గోర్షకోవ్ లో అగ్ని ప్రమాదం సంభవించినప్పటి నుండి పెద్ద దూరాలకు ప్రయాణించలేదు. అదీకాకుండా ఈ నౌకకు పూర్తి మరమ్మతులు చేపట్టవలసి ఉంది. భారత దేశం సొంతంగా విమాన వాహక యుద్ధనౌకను తయారు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం 2014-15 దాకా గడువు నిర్ణయించుకుంది.