కొండెక్కిన 'గోర్షకోవ్' ధర!
అయిదేళ్ల రష్యా నాటకం: 2004-09
2004 జనవరి: ఎన్డిఏ హయాంలో విమాన వాహక యుద్ధ నౌకతో పాటు మిగ్ 29 కె యుద్ధ విమానాలను 974 మిలియన్ డాలర్లకు కొనుగోలు ఒప్పందం.
2007 ఏప్రిల్: ఒప్పందంలో అనుకున్న సమయానికి యుద్ద నౌకను అందించలేము, అదే సమయంలో షిప్ బిల్డర్స్ యుద్ధ నౌక ధరను తప్పుగా అంచనా వేసారని రష్యా తెలిపింది.
2007 నవంబర్: గోర్షకోవ్ యుద్ధ నౌకకు భారత్ అదనంగా మరో 1.2 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని రష్యా కోరింది.
2008 ఫిబ్రవరి: భారత రక్షణ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో గోర్షకోవ్ ను పరిశీలించిన నిపుణుల బృందం.
2008 మే: రష్యా యుద్ద నౌకకు ముందస్తుగా 250మిలియన్ డాలర్లను భారత్ చెల్లించింది. పెండింగ్ లోని ధరపై చర్చలు కొనసాగించింది.
2008 జూన్: యుధ్ద నౌక మరమ్మతుల కోసం అదనంగా నిపుణులను రష్యా నియమించింది. మరింత అడ్వాన్స్ కోసం భారత్ ను కోరింది.
2008 డిసెంబర్: యుద్ద నౌక కాంట్రాక్టును పున:సమీక్షించేందుకు సిసిఎస్ అనమతించింది. ఇప్పటివరకు 500 మిలియన్ డాలర్లను రష్యాకు భారత్ చెల్లించింది.
2009 జనవరి-ఫిబ్రవరి: యుద్ధనౌక ధరప చివరి విడత చర్చలు జరుగనున్నాయి.
Pages: -1- -2- 3 News Posted: 20 February, 2009
|