పురంధరేశ్వరి పోటీ ఎక్కడ?
హైదరాబాద్: లోక్ సభ అభ్యర్ధుల ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పికానుంది. పునర్విభజనతో కొన్ని నియోజకవర్గాలు రద్దుకాగా, కొన్ని జనరల్ సీట్లు రిజర్వుడు జాబితాలోకి, రిజర్వుడు జనరల్ కేటగిరీలోకి చేరాయి. దీంతో కొంతమంది సిటింగ్ సభ్యుల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. పది నుంచి పదిహేను సెగ్మెంట్లలో అభ్యర్ధుల ఎంపిక అధిష్టానానికి సమస్యగా మరింది. సీట్లు కోల్పోయిన ఇద్దరు కేంద్ర మంత్రులతోపాటు సిటింగ్ లను సర్దుబాటుచేయడం అధిష్టానానికి శిరోభారమే. ఫలితంగా లోక్ సభ టెక్కెట్ల కోసం కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురందరేశ్వరి, పనబాక లక్ష్మి ఎక్కడి నుంచి పోటీచేస్తారన్నది ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశమయింది. పురందరేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వుకావడంతో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. నియోజకవర్గాల పునర్విఙజన అనంతరం నరసరావుపేట స్థానంలో ఇప్పటివరకు రెడ్డి ప్రాబల్యం వున్న ప్రాంతాలు పోయి, కొత్తగా కమ్మ కులం ప్రాబల్యం వున్న ప్రాంతాలు కలిశాయి. ప్రస్తుతం ఈ స్థానానికి ప్రాతినిధ్యంవహిస్తున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 22 February, 2009
|