పురంధరేశ్వరి పోటీ ఎక్కడ?
అయితే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కూడా నెల్లూరు నుంచే పోటీచేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఎస్సీ రిజర్వుడుగా ఉండడంతో నేదురుమల్లి విశాఖపట్నం నుంచి గత ఎన్నికల్లో పోటీచేశారు.ఈసారి సొంతజిల్లా నెల్లూరు స్థానం జనరల్ కావడంతో వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీచేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఆయన మళ్లీ విశాఖపట్నం నుంచే పోటీ చేయాలని పార్టీ ఆదేశించినట్టయితే, తాను నెల్లూరు నుంచి పోటీ చేయాలని మేకపాటి ఆశిస్తున్నారు. ఆయనకు నెల్లూరు టిక్కెట్ లభిస్తే నరసరావుపేట నుంచి పురందరేశ్వరి పోటీచేసే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుత తెనాలి ఎంపి బాలశౌరి కూడా నరసరావుపేట స్థాన్ని కోరుకుంటున్నారు. తెనాలి లోక్ సభ స్థానం రద్దవడంతో ఆయన కొత్త సెగ్మెంట్ కోసం అన్వేషిస్తున్నారు.మేకపాటి నెల్లూరుకు వెళ్లిన పక్షంలో నరసరావుపేట నుంచి పోటీచేయాలని బాలశౌరి ఆలోచిస్తున్నారు. ఒకవేళ నరసరావుపేట టిక్కెట్ పురందరేశ్వరికి ఇచ్చినట్టయితే గురజాల అసెంబ్లీ స్థానానికి పోటీచేయాలని బాలశౌరి ఆశిస్తున్నట్టు సమాచారం.
పనబాక లక్ష్మి చిత్తూరు టిక్కెట్ ఆశిస్తుండగా, దానిని డిప్యూటీ స్పీకర్ జి.కుతూహలమ్మకు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించారని తెలిసింది. తిరుపతి టిక్కెట్ ను సిటింగ్ ఎంపి చింతా మోహన్ ను కాదని పనబాక లక్ష్మికి ఇచ్చే అవకాశాలు లేవు. లోక్ సభ టిక్కెట్ రాని పక్షంలో గూడూరునుంచి అసెంబ్లీకి పోటీచేయాలని ఆమె అనుకుంటుండగా, అందుకు నేదురుమల్లి అడ్డుపడే పరిస్థితి వుంది. పనబాక లక్ష్మి గూడూరు నుంచి పోటీ చేసిన పక్షంలో, ఒకవేళ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తన భార్య రాజ్యలక్ష్మికి మంత్రివర్గంలో స్థానం లభించడం కష్టమని ఆయన అభిప్రాయపడుతున్నారట. లక్ష్మి భర్త కృష్ణయ్య కూడా పోటీ చేయాలనుకుంటున్నారని, ఆయన పోటీ చేయాల్సి వస్తే గూడూరు నుంచే చేయాల్సివుంది. అయితే తన సన్నిహితుడు పట్రా పు్రకాశరావును కాదని కృష్ణయ్యకు గూడూరు టిక్కెట్ ఇచ్చేందుకు నేదురుమల్లి అంగీకరించకపోవచ్చని భావిస్తున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 22 February, 2009
|