పురంధరేశ్వరి పోటీ ఎక్కడ?
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మిర్యాలగూడ స్థానంనుంచి గత ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. మహాకూటమి, తెలంగాణ ప్రభావం వల్ల మిర్యాలగూడ నుంచి రాబోయే ఎన్నికల్లో గెలవడం సాధ్యంకాదనుకుంటున్న జైపాల్ రెడ్డి కొత్తగా ఏర్పడ్డ రంగారెడ్డిజిల్లా చేవెళ్ల లోక్ సభ స్థానంపై కన్నువేశారు.అనంతపురం లోక్ సభ స్థానానికి అనంత వెంకట్రాంరెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యంవహిస్తుండగా, ఈసారి టిక్కెట్ తనకివ్వాలని మంత్రి దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి పట్టుపడుతున్నారు. అలాగే, నంద్యాల లోక్ సభ స్థానానికి ప్రస్తుతం ఎస్పీవై రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా టిక్కెట్ ఈసారి తనకివ్వాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల ప్రతాప్ రెడ్డి కోరుతున్నారు. గతంలో స్థానం నుంచి ఆయన గెలుపొందారు. నిజామాబాద్ లోక్ సభ స్థానానికి ప్రస్తుతం మధుయాష్కి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈసారి పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాసం నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఆయన పోటీచేస్తే మధుయాష్కికి టిక్కెట్ ్నుమానమే.
సికిందరాబాద్ లోక్ సభ స్థానానికి ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యంవహిస్తుండగా, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇప్పుడాయనకు అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మహబూబ్ నగర్ ఎంపి డి.విఠల్ రావు పరిస్థితి కూడా సస్పెన్స్ లో పడింది. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం ఎంపి మందా జగన్నాధం ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఈసారి జగన్నాధానికే టిక్కెట్ ఇస్తారా లేక క్రితంసారి పోటీచేసి ఓడిపోయిన ఎమ్మెల్యే మల్లు రవికి ఇస్తారా అన్నది చర్చనీయాంశమయింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానాల టిక్కెట్లు ఎవరికి లభిస్తాయన్నదానిపై కూడా వేడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి కిల్లి కృపారాణి లేదా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పోటీచేయవచ్చని తెలుస్తోంది.
Pages: -1- -2- 3 News Posted: 22 February, 2009
|