కుర్చీ ఒక్కటే కులాలు మూడు!
హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి గద్దెనెక్కేది ఎవరు? మళ్లీ వైఎస్సారా? ఈసారి చంద్రబాబా? లేక కొత్తగా చిరంజీవా? సిఎం పదవి దక్కేది తెలంగాణకా, లేక కోస్తాంధ్రకా, మళ్లీ రాయలసీమకేనా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే తలలు వేయి వ్రక్కలు కావు కాని, వాటిమీద ఉత్కఠమైన వాదాలు, చర్చలతో ఎందరో తలలు బద్దలు కొట్టుకుంటున్నారన్నది మాత్రం నిజం. ఈసారి ఎన్నికల్లో పోటీ ప్రధానంగా మూడు కులాలు, రెండు ప్రాంతాల మధ్య నెలకొంది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ముగ్గురూ రాష్ట్రంలో మూడు ప్రధాన కులాలకు చెందినవారు కాగా, ఇద్దరు(వైఎస్, చంద్రబాబు) ఒకే ప్రాంతానికి చెందిన వారు. అంటే, ఇంతకుమునుపు ఎన్నడూ లేనట్టుగా కులాల ప్రాతిపదికన ఓటర్లు చీలీపోతారన్న మాట. ఇక తెలంగాణ నినాదానికి నీళ్లొదిలేస్తారన్నది నిర్వివాదం.
కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మధ్య జరుగనున్న పోటీలో, కాంగ్రెస్ గెలుపొందితే సిఎం కుర్చీ మళ్లీ రాజశేఖరరెడ్డిదే. తెలుగుదేశం గెలుపొందితే చంద్రబాబు, ప్రజారాజ్యం గెలిస్తే చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారు. ముగ్గురూ వరుసగా రెడ్డి, కమ్మ, కాపు కులాలకు చెందినవారు. సంఖ్యాపరంగా చూస్తే కాపుల జనాభా అధికం. తదనుగుణంగానే గ్రూపులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒకవేళ హంగ్ ఏర్పడి టిఆరెస్ నిర్ణయాత్మక పాత్ర వహించాల్సి వస్తే, సిఎం పదవి ఎవరికి దక్కుతుందన్నది చెప్పడం కష్టమే. అయితే రాష్ట్ర చరిత్రలో ఇంతవరకూ హంగ్ అసెంబ్లీ ఏర్పడ లేదు.
Pages: 1 -2- News Posted: 23 February, 2009
|