'స్లమ్ డాగ్' ఓ ట్రాష్...
ముంబై: రెండు ఆస్కార్లు అందుకున్న శుభ తరుణంలో కోడాక్ థియేటర్ వేదిక నుంచి 'మేరా పాస్ మా హై' అంటూ రెహ్మాన్ ఎలుగెత్తి చాటారు. అమ్మ కరీమా బేగమ్ ను తలుచుకుంటూ ఆయన స్పందించడం ఆహుతులందర్నీ అలరించి ఉండొచ్చు. ఆయన నోటి నుంచి వెలువడిన ఈ మాట సరిగ్గా 1970వ దశకంలో వచ్చిన బాలీవుడ్ మూవీ 'దీవార్' చిత్రంలో పాపులర్ అయిన సంభాషణే కావడం విశేషం. అదే దశకంలో వచ్చిన పలు పాపులర్ బాలీవుడ్ చిత్రాల ఛాయలు, విజువల్ రిఫరెన్స్ లు డోనీబోయిల్ 'స్లమ్ డాగ్ 'లోనూ కొట్టిచ్చినట్టు కనిపిస్తాయంటూ కొందకు చర్చకు తెరలేపుతున్నారు కూడా. అలనాటి అజరామర చిత్రాల పోలికలు 'స్లమ్ డాగ్..' లో కనిపించడం యాదృచ్ఛికమా, ఉద్దేశపూర్వకమా అనేది చర్చల్లోనే నిగ్గుతేలాల్సి ఉంటుంది.
'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రం ఆదివారం రాత్రి లాస్ ఏంజెల్స్ లో జరిగిన 81వ వార్షిక అకాడమీలో 8 అవార్డులు గెలుచుకోవడంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న వారు కూడా లేకపోలేదు. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూడా ఉన్నారు. 'చిన్నప్పుడే అన్నదమ్మలు విడిపోవడం, చిన్నప్పటి స్వీట్ హార్ట్ ల ఉదంతంతో సలీమ్ జావేద్ లు ఎప్పుడో 70 దశకంలో కథలు రాశారు. స్లమ్ డాగ్ మిలయనీర్ చిత్రం అలాంటి కమర్షియల్ అంశాలే గుదిగుచ్చిన చీప్ ట్రాషీ ఫిల్మ్ తప్ప మరొకటి కాదు. ఇలాంటి ట్రాషీ ఫిల్మ్ ను ఎంపిక చేయడమంటే ప్రపంచ సినిమాను గోల్జెన్ గ్లోబ్, ఆస్కార్ కమిటీలు నిర్లక్ష్యం చేసినట్టుగానే అనుకోవాల్సి ఉంటుంది' అని ప్రియదర్శన్ వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 24 February, 2009
|