'స్లమ్ డాగ్' ఓ ట్రాష్...
'స్లమ్ డాగ్ ...' చిత్రం రొటీన్ కమర్షియల్ ఫార్ములాతో ఉన్న స్థాయి తక్కువ సినిమాగానే పరిగణించవచ్చా అనేది చర్చకే విడిచిపెట్టాలి. అయితే 'స్లమ్ డాగ్' చిత్రం తెరకెక్కిన స్టయిల్, ప్లాట్ 70వ దశకంలో వచ్చిన సినిమాలను స్ఫూరణకు తెస్తాయనేది అవార్డు వ్యతిరేక వర్గాల వాదన. తరచి చూస్తే...ఎల్డర్ జమాల్, సలీమ్ తొలిసారి కలుసుకునే సన్నివేశం 'దీవార్' ను గుర్తుచేస్తుంది. అమితాబ్-శిశికపూర్ స్టయిల్ లోనే ఒక నిర్మాణ స్థలం వద్ద వారిద్దరూ కలుసుకుంటారు. స్లమ్ డాగ్ చిన్నారులు రైళ్ల పైన పరిగెత్తడం, దూకడం ఎన్ని బాలీవుడ్ చిత్రాల్లో చూడలేదు?. 'యాదోం కి బారాత్' నుంచి 'శక్తి' సినిమా వరకూ డ్రామా ప్రధానంగా నడిచిన చిత్రాలే కదా. వీధి పిల్లల్ని పట్టుకుని వారిని ప్రొఫెషనల్ బిచ్చగాళ్లుగా మారుస్తున్నట్టు 'స్లమ్ డాగ్ ' చిత్రంలో చూపించడం చాలామందిని ఖంగు తినిపించింది. అయితే 35 ఏళ్ల క్రితమే రణ్ ధీర్ కపూర్, వినోద్ ఖన్నా ముఖ్య పాత్రధారులుగా వచ్చిన 'హాథ్ కీ సఫాయ్' చిత్రం కోసం ఇలాంటి సన్నివేశాలనే జావేద్ అక్తర్ రచించారు. అందులో నటుడు సత్యేన్ కప్పు చిన్నపిల్లలకు అడుక్కోవడం, దొంగతనాలు నేర్పిస్తుంటాడు. ఇక మాధుర్ బండార్కర్ కూడా 'స్లమ్ డాగ్' చిత్రం తాను తీసిన 'ట్రాఫిక్ సిగ్నల్' చిత్రాన్ని జ్ఞప్తికి తెచ్చినట్టు ఇటీవల చెప్పుకొచ్చారు. భారతీయ రచయిత రాసిన కథ ఆధారంగా 'స్లమ్ డాగ్ ' రూపొందినప్పటికీ అందులోని హమహ్మద్ థామస్ పేరును జమాల్ మలిక్ గా స్క్రిప్టు రచయిత మార్పు చేశారు. ఏతావాతా 'స్లమ్ డాగ్ ' పూర్తిగా కేవలం కాపీ, పేస్ట్ వ్యవహారమంగానే నడిచిందని చెప్పడం సబబు కాకపోవచ్చు. కాకుంటే 70వ దశకంలో విరివిగా హిందీ సినిమాలు చూసిన వారికి మాత్రం అసంకల్పితంగానే పలు సినిమాలు స్ఫురణకు రావడం ఖాయం..
Pages: -1- 2 News Posted: 24 February, 2009
|